రోజుకు రూ.2తో.. ఏకంగా రూ.15,00,000.. పోస్టాఫీస్ గేమ్ ఛేంజింగ్ స్కీమ్స్.. అర్హతలు ఇవే

Wait 5 sec.

Post Office: ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే వరకు ప్రాణాలకు ఏ గ్యారెంటీ లేదు. నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక మరణం అంటే ఒక వ్యక్తిని కోల్పోవడం కాదు ఒక కుటుంబం రోడ్డున పడడం. ఇంటి పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డు మీదకు వస్తుంది. అయితే, కుటుంబాన్ని వ్యక్తిగత ప్రమాద బీమా ఆదుకుంటుంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అయితే, ప్రీమియం ఎక్కువగా ఉందన్న కారణంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ భారతీయ తపాలా శాఖ (పోస్టాఫీసు) అద్భుతమైన లాంచ్ చేసింది. భారతీయ తపాలా శాఖ తక్కువ ప్రీమియంతో లక్షల్లో బీమా రక్షణ కల్పిస్తోంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఈ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్స్ అందిస్తోంది. అల్ట్రా లో ప్రీమియం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అందిస్తోంది. ఒక కప్పు చాయ ఖర్చు కన్నా తక్కువతోనే ఈ బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇందులో రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. ప్లాన్ 1‌లో బీమా ప్రీమియం ఏడాదికి రూ.549 మాత్రమే. అంటే రోజుకు రూ.1.50 లోపే పడుతుంది. దీంతో రూ.10 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వారు అర్హులు. గ్రామీణ, అర్బణ్ ప్రాంతాల వారు సైతం ఈ బీమా పలసీ తీసుకోవచ్చు. ఏదైనా పోస్టాఫీసు లేదా ఐపీపీబీ బ్రాంచుకు వెళ్లి ఈ బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు.ప్లాన్ 2లో బీమా ప్రీమియం ఏడాదికి రూ.749 మాత్రమే. దీంతో రూ.15 లక్షల బీమా రక్షణ లభిస్తుంది. 18- 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ ప్లాన్ కొనుగోలు చేసేందుకు అర్హలు. రోజుకు ప్రీమియం సుమారు రూ.2 మాత్రమే పడుతుంది. ఏదైనా పోస్టాఫీస్, పోస్టల్ బ్యాంక్ ఐపీపీబీ బ్రాంచులో ఈ బీమా కొనుగోలు చేయవచ్చు.బీమాతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ప్రమాదంలో మరణించినా, శ్వాశ్వత వైకల్యం ఏర్పడినా లేదా గాయపడినా బీమా వర్తిస్తుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, పాక్షిక వైక్యలం కవరేజీ, అడ్డంకులు లేని నామినీ సెటిల్మెంట్, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగంగా జరిగేందుకు అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. రైతులు, గ్రామీణ కార్మికులు, గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికులు, పట్టణంలోని కార్మికులు, 65 ఏళ్ల లోపు సీనియర్ సిటిజన్లు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి అందించి ప్రీమియం రూ.549 లేదా రూ.749 ఏది కావాలో సూచించాల్సి ఉంటుంది.