ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విషయం తెలిసిందే. ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో.. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ఆదేశించారు. తాజాగా కూడా కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత, ఆస్తి వివాదాల్లో తల దూరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను బెదిరిస్తున్నారని, తప్పులకు పాల్పడుతున్నారన్నారు. ఆశ్చర్యకరంగా.. ఎవరైనా వ్యక్తులు రాజీ పడటానికి సిద్ధమైతే.. ఎమ్మెల్యేలు వారిని రాజీ పడనివ్వడం లేదని మండిపడ్డారు. ఇలాగే ఓ ఎమ్మెల్యే వ్యవహారం తన వద్దకు వస్తే.. తీరు మారాలని వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలా చేయకపోతే ప్రజల్లో చులకన అవుతాం.. కూటమిలో ఏ పార్టీ శాశనసభ్యులు తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేలు మితిమీరి ప్రవర్తిస్తే.. ఉపేక్షించవద్దని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులూ చొరవ తీసుకోవట్లేదని పవన్ మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. తనకు వస్తున్న అర్జీల్లోనూ దాదాపు 70 శాఆతం రెవెన్యూ సమస్యలేనన్నారు. ప్రజల ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. ప్రజల్లో చులకన అవుతామని పవన్ చెప్పడం గమనార్హం. కాగా, ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇంఛార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులూ.. ఇదేం విడ్డూరం.. అధికారుల తీరుపై కూడా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాల్సిన అధికారులు.. పొలిటికల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పినా.. కొందరు సొంతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యలతో ప్రజలు వస్తే.. ఎమ్మెల్యేలు, నాయకులు చెబితేనే చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. ఇలా చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని పవన్ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదని అన్నారు. అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదని చెప్పారు. ఈ విషయంపై సీనియర్‌ ఎమ్మెల్యేలు, నేతలు.. కొత్తగా ఎన్నికైన వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ పెద్దల కోపంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించినా.. ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన ప్రభుత్వం పెద్దల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వారు బహిరంగగానే ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.