కర్నూలు బస్సు ప్రమాదం.. ఒక్కడు దయ తలిచినా, 19 మంది ప్రాణాలు దక్కేవి.. వెలుగులోకి మరో వీడియో

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపినలో మరో వీడియో బయటకు వచ్చింది. బస్సు ప్రమాదం జరగకముందు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. మరో బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ ఫుటేజీలో రోడ్డు పక్కన శివశంకర్ మృతదేహం, ఎర్రిస్వామి కనిపిస్తున్నారు. అలాగే డివైడర్ పక్కన బైక్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను చాలా బస్సులు చూసీచూడనట్లు వెళ్లిపోవటంఈ దుర్ఘటనకు కారణమైంది. అందులో ఎవరు స్పందించినా ఇంత అనర్థం జరగకపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో ఎవరో ఒకరు దయ తలచి.. బైక్‌ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి.. ఎర్రిస్వామికి సాయం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని.. 19 మంది సజీవ దహనమయ్యే పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కర్నూలు జిల్లా బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బైక్‌ను ఢీకొట్టిన కారణంగా బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. లక్ష్మీపురానికి చెందిన శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి అర్ధరాత్రి సమయంలో బైక్ మీద తుగ్గలికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో శివశంకర్ బైక్ డ్రైవింగ్ చేయగా.. చిన్నటేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో శివశంకర్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో శివశంకర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ మీద వెనుకవైపున కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్‌ను పక్కకు లాగాడు ఎర్రిస్వామి. బైక్‌ అలాగే రోడ్డు డివైడర్ పక్కన ఉండిపోయింది. అయితే వేగంగా వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో.. రాపిడికి బస్సు కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన ఎర్రిస్వామి శివశంకర్ సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి తుగ్గలికి పారిపోయాడు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించటంతో అసలు ఏం జరిగిందనేదీ బయటపడింది. అయితే శివశంకర్ బైక్ ప్రమాదం తర్వాత.. అటుగా వెళ్తున్న బస్సులు, ఇతర వాహనాలలో కనీసం ఒకరు స్పందించి వారికి సాయం చేసినా.. ఇంతటి ఘోరం జరగపోయి ఉండదని.. 19 మంది ప్రాణాలతో బయటపడేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.