MCLR: దేశంలోని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ () తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. రుణాల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రుణాలకు లింక్ అయి ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) అన్ని టెన్యూర్ల రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో పర్సనల్ లోన్, ఆటో లోన్, హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ ()ల భారం తగ్గనుంది. ఇక సవరించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేటు ఏంటి?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అనేది, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వివిధ రుణాలు ఫ్లోటింగ్ రేటుతో తీసుకునే వడ్డీని నిర్ణయించేందుకు బ్యాంకులు బెంచ్‌మార్క్ రేటుగా ఉపయోగిస్తాయి. ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువకు రుణాలు ఇవ్వరు. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గినప్పుడు రుణాల నెలవారీ వాయిదాల భారం తగ్గుతుంది. లేదా లోన్ టెన్యూర్ తగ్గించుకోవచ్చు. దీంతో రుణ గ్రహీతలకు దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. కెనరా బ్యాంక్ కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లుఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గింది. వన్-మంత్ ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతం నుంచి 7.95 శాతానికి దిగివచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.20 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం నుంచి 8.70 శాతానికి పడిపోయింది. రెండోళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.85 శాతం, 8.90 శాతానికి తగ్గాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేట్లు యథాతథంప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంసీఎల్ఆర్ రేటు మారలేదు. దీంతో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.90 శాతం, మూడు నెలల వడ్డీ రేటు 8.20 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.60 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతంగా ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేట్లుఐడీబీఐ బ్యాంకులోనూ ఎంసీఎల్ఆర్ రేట్లు మారలేదు. దీంతో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం, మూడు నెలల వడ్డీ రేటు 8.50 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.70 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.30 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.70 శాతంగా ఉన్నాయి.