: కొంత కాలంగా భారతీయ ఐటీ కంపెనీల స్టాక్స్ పెద్దగా రాణించట్లేదని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా అన్నీ గరిష్ట స్థాయిల నుంచి భారీగా పడిపోయాయి. ఈ స్టాక్స్ పతనానికి ప్రధాన కారణం.. అమెరికాలోని కంపెనీల్లో విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు యాజమాన్యాలు ఇచ్చే హెచ్1- బీ వీసాలపై కఠిన రూల్స్ తీసుకురావడమే. అవును.. . దీంతో.. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న . ఇవి ఎక్కువగా ఈ వీసాలపై ఆధారపడి పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా.. తన స్వరం మార్చారు. సంస్కరణల అమలుపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా హెచ్1-బీ వీసాలపై, వలస దారుల విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో భారతీయ ఐటీ కంపెనీలకు ఇది శుభవార్తగా పరిణమించింది. ఈ క్రమంలోనే పలు ఐటీ స్టాక్స్ బుధవారం సెషన్‌లో భారీగా దూసుకెళ్తున్నాయి. అమెరికన్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాల్ని భర్తీ చేసేందుకు విదేశాల నుంచి ప్రత్యేక నిపుణుల అవసరం ఉందని ట్రంప్ అంగీకరించారు. ఈ వ్యాఖ్యలే.. అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంకేతాలతో దేశీయ ఐటీ రంగంలో.. ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి. టెక్ మహీంద్రా స్టాక్ అత్యధికంగా 4 శాతం వరకు పెరిగి రూ. 1460 స్థాయిలో కదలాడుతోంది. టీసీఎస్ షేరు 2.50 శాతం పెరగడంతో రూ. 3,125 స్థాయిలో ఉంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 1.70 శాతం వరకు పెరిగాయి. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత భారతీయ ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల కళ కనిపిస్తుంది. >> అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఉందని ట్రంప్ సదరు ఇంటర్వ్యూలో అంగీకరించారు. వేర్వేరు రంగాల్లో వేర్వేరు దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు ఉన్నారని.. వారు తమకు అవసరం అని వ్యాఖ్యానించారు. సౌత్ కొరియా నుంచి వచ్చే కార్మికులు బ్యాటరీ తయారు చేయడంలో నిష్ణాతులని.. వారు చాలా ప్రతిభ కలిగి ఉంటారని.. సరైన శిక్షణ లేని కార్మికులతో ఆ స్థానాల్ని భర్తీ చేయలేమని అన్నారు. ఇలా ఒక్కో దేశం నుంచి ఒక్కో రంగంలో నిపుణులు ఉన్నారని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే హెచ్-1 బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే అక్కడి భారతీయ ఐటీ కంపెనీలకు ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తేజాన్నిచ్చాయి. ఇదే కొనుగోలుదారుల్లోనూ జోష్ నింపింది.