నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి, ఆపై అత్యాచారం.. తెల్లారి డ్రైనేజీలో..

Wait 5 sec.

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కోల్‌కతా సమీపంలో. అనంతరం బాలికను డ్రైనేజీలో కనుగొన్నారు. బెంగాల్‌లో ఈ ఘటన రాజకీయ దుమారానికి తెర లేపింది. మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రతపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. ఇదీ జరిగింది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుగ్లీ జిల్లా తారకేశ్వర్ ప్రాంతంలో.. రైల్వే షెడ్డు వద్ద తన అమ్మమ్మ ఈ క్రమంలో బాలికను ఓ దండగుడు కిడ్నాప్ చేశాడు. దోమ తెరను కత్తిరిచి చిన్నారిని అపహరించాడు. ఈ ఘటన శుక్రవారం (నవంబర్ 7) తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది. బాలికను తీసుకెళ్లినట్లు తనకు కొంచెం కూడా తెలియలేదని .. చిన్నారి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తెల్లారి లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదని తెలిపింది. డ్రైనేజీలో బాలిక..అనంతరం చిన్నారి కోసం గాలించగా.. ఆ తర్వాత రోజు మధ్యాహ్న తారకేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీలో ఆచూకీ తెలిసిందని పోలీసులు తెలిపారు. చిన్నారి తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్నట్లు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిననట్లు పోలీసులు వెల్లడించారు.'ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు..'ఈ ఘటన బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ పాశవిక ఘటనపై పోలీసులు మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపించారు. ఈ మేరకు బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. "తారకేశ్వర్‌లో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు! ఆసుపత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి చందననగర్‌కు రిఫర్ చేశారు. నేరాన్ని కప్పిపుచ్చే పనిలో తారకేశ్వర్ పోలీసులు నిమగ్నమయ్యారు" అని సువేందు అధికారి మండిపడ్డారు. 'మమతా బెనర్జీ.. ఫెయిల్డ్ సీఎం..'"ఇది మమతా బెనర్జీ ఫ్రీ-ఫర్-ఆల్ పాలన నిజ స్వరూపం. ఒక చిన్నారి జీవితం ఛిన్నాభిన్నమైనా.. పోలీసులు నిజాన్ని తొక్కేసి.. రాష్ట్రంలో ఫేక్ శాంతిభద్రతల ఇమేజ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ.. ఒక విఫలమైన ముఖ్యమంత్రి. ఆమె పాలనలో పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతిసారీ ఇదే కథ: అత్యాచారం జరగడం → ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం/ ఆలస్యమవడం → ఆసుపత్రి తీసుకెళ్లడం → మీడియా బ్లాక్అవుట్ → ఈ దారుణాలను టీఎంసీ నాయకులు కప్పిపుచ్చడం!" అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.