నెలనెలా జీతం వచ్చే వారికే పర్సనల్ లోన్ వస్తుందా.. క్రెడిట్ స్కోరు తగ్గుతుందా.. సమాధానాలిదిగో..

Wait 5 sec.

Personal Loan Credit Score: ఇటీవల పెరుగుతున్న అవసరాలు, ఊహించని ఖర్చుల నేపథ్యంలో.. చూపిస్తుంటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఏ బ్యాంకులో తీసుకోవాలి. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి. ఎలా ఉండాలి.. ఎంత లోన్ తీసుకోవాలి. ఇప్పటికే ఒక లోన్ ఉంటే మరొకటి తీసుకోవచ్చా.. తీసుకుంటే క్రెడిట్ స్కోరు నిజంగానే తగ్గుతుందా.. ఇలా చాలానే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇక్కడ కొన్ని అపోహాల కారణంగా చాలా మంది.. అధిక వడ్డీకి బయట అప్పులు చేస్తున్నారు. మరి.. పర్సనల్ లోన్లకు సంబంధించి.. ఈ అపోహల గురించి మనం చూద్దాం. >> ముందుగా వేతన జీవులు అంటే నెలనెలా జీతం వచ్చే వారికే పర్సనల్ లోన్ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఉద్యోగులకే కాదు.. ఫ్రీలాన్సర్స్, స్వయం ఉపాధి పొందేవారు (సెల్ఫ్ ఎంప్లాయిడ్), వ్యాపారం చేసేవారు కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా లోన్లు ఇచ్చే ముందు బ్యాంకులు.. అనేది చూస్తాయి. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్, టాక్స్ రిటర్న్స్, బిజినెస్ ఇన్‌కం డాక్యుమెంట్స్ సమర్పించాలి. >> పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే క్రెడిట్ స్కోరు తగ్గుతుందనేది కూడా అపోహే. మీరు తరచుగా లోన్స్ కోసం ఎంక్వైరీ చేసి.. వాటి కోసం అప్లై చేస్తే అప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. ఇంకా సమయానికి ఈఎంఐలు చెల్లించకపోతే కూడా స్కోరు తగ్గతుంది. నిజం చెప్పాలంటే.. లోన్ తీసుకొని సమయానికి ఈఎంఐ చెల్లిస్తూ పోతే క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. భవిష్యత్తుల్లో తక్కువ వడ్డీకే లోన్లు అందించడంలో సహాయపడుతుంది. >> ఇప్పటికే పర్సనల్ లోన్ తీసుకుంటే.. మరొక లోన్ రాదన్నది కూడా అపోహే. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ రుణ- ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తాయి. ఆర్థికంగా మీరు బాగుంటే.. మరో లోన్ తీసుకునేందుకు బ్యాంకులు అభ్యంతరం చెప్పవు. >> పర్సనల్ లోన్ పొందడం చాలా కష్టం అనేది కూడా అపోహే. ఈ రోజుల్లో వ్యక్తిగత రుణాల జారీ వేగం పుంజుకుంటుంది. బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండానే.. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసినా క్షణాల్లో డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. మంచి ఆదాయం, క్రెడిట్ హిస్టరీ ఉండి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే.. త్వరగా లోన్ వస్తుంది. గతంలో లోన్ ప్రాసెసింగ్‌కు చాలా రోజుల సమయం పట్టేది. అదే ఇప్పుడు చూస్తే.. నిమిషాల్లో లేదా 1-2 రోజుల్లో కూడా వస్తుంది. డిజిటల్ బ్యాంకింగ్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇంకా మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి.. బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కూడా అందిస్తున్నాయి. లోన్ అవసరమైనప్పుడు యాప్‌ లేదా వెబ్‌సైట్లో క్లిక్ చేస్తే.. క్షణాల్లో డబ్బులు వస్తాయి.