: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. తమ స్థోమతకు తగినట్లుగా బంగారం కొంటూనే ఉంటారు. ఇక పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల వంటి సమయాల్లో బంగారం తప్పనిసరిగా ఉండాలంటారు. ఆయా సమయాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. జువెలరీ దుకాణాలు కొనుగోలుదారులకు కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా దసరా, దీపావళి పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే, ఈ 2025లో విపరీతంగా పెరిగాయి. తులం బంగారం రేటు లక్షా ఇరవై వేలాకు పైగా పలుకుతోంది. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా నిర్ణయాలు, డాలర్ విలువ, యుద్ధాలు, బంగారం సరఫరా డిమాండ్ అంటూ ఎన్నో అంశాలు పసిడి ధరలతో ముడి పడి ఉంటాయి. క్రితం రోజు తగ్గిన బంగారం ఇవాళ అదే ధర వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 9వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర మళ్లీ నాలుగు వేల మార్క్ దాటింది. ఇవాళ ఔన్స్ గోల్డ్ రేటు 4001 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 48.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరఇవాళ 22 క్యారెట్ల నగల బంగారం రేటు తులానికి రూ. 1,11,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల 99.9 శాతం ప్యూర్ గోల్డ్ రేటు రూ. 1,22,020 వద్ద అమ్ముడవుతోంది. స్థిరంగానే వెండి ధరహైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి సైతం ఊరట కల్పించింది. గత మూడు రోజుల నుంచి ఒకే ధర వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంత మార్కెట్లలో కిలో వెండి రేటు రూ.1,65,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. అయితే, ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో కిలో వెండి రూ.1,52,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్ రేట్లు. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్లలో ఉండే ధరలు తెలుసుకోవడం మంచిది.