దేశ రాజధాని తలెత్తిన విషయం తెలిసిందే. దీని కారణంగా 800 విమానాలు ఆలస్యం అయ్యాయి. కొన్ని విమానాలు రద్దు అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సర్వర్‌లోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఈ గందరగోళం చోటుచేసుకుంది. అయితే తాజాగా ఈ విషయంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏటీసీలో సాంకేతిక సమస్యలపై నెలల ముందే హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ (ATC) గిల్డ్‌ ఇండియా వెల్లడించింది. ముందే హెచ్చరించిన పట్టించుకోలేదు.పౌరవిమానయానానికి సంబంధించిన మౌలిక వసతులను సృష్టించడం, అప్‌గ్రేడ్ చేయడం, నిర్వహించడం (AAI) పని. ఇది పౌర విమానయాన శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సమస్యల గురించి AAIకి తాము జులైలో హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ (ATC) గిల్డ్‌ ఇండియా వెల్లడించింది. ఏటీసీలో సమస్యలు, అప్‌గ్రేడ్‌ల గురించి తెలియజేశామని తెలిపింది. తమ సూచనలను AAI అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది. తర్వాత దీనికి సంబంధించి అధికారులకు తాము లేఖ రాశామని తెలిపింది. ఎయిర్‌ నావిగేషన్‌ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్‌ వ్యవస్థలు కాలానుగుణంగా సమీక్షించి.. అప్‌గ్రేడ్‌ చేయడం అవసరమని చెప్పినట్లు వెల్లడించింది. ఇప్పుడున్న వ్యవస్థలు పాతబడిపోయాయని వాటిని అప్‌గ్రేడ్ చేయాలని చెప్పినట్లు తెలిపింది. ప్రమాణాలు మెరుగుపరచాలి.. భారతీయ విమానాశ్రయాల్లో వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేయాలని వెల్లడించినట్లు ఏటీసీ పేర్కొంది. భారత వ్యవస్థలు.. యూరప్‌ యూరో కంట్రోల్‌, అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)ల తరహాలో ఉండాలని చెప్పినట్లు వెల్లడించింది. ఈ దేశాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణలు.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఈ భద్రతా సమస్యలను ఏఏఐ వద్ద తాము అనేకసార్లు లేవనెత్తినా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిల్డ్‌ ఆరోపించింది. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ వ్యవస్థ.. ఫ్లైట్ ప్లాన్ డేటాను.. ఏటీసీ స్క్రీన్లపైకి ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ఈ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా.. ఫ్లైట్ ఆపరేషన్లు మాన్యువల్ విధానంలోకి మారిపోయాయి. దీని వల్ల చాలా విమానాలు ఆలస్యమయ్యాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించినట్లు ఏఏఐ శనివారం వెల్లడించింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆపరేషన్లు అన్నీ సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపింది. కాగా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్‌లో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టు. పీక్ సమయాల్లో గంట 60- 70 విమానాలు టేకాఫ్‌, ల్యాండిగ్ అవుతాయి. ఇక్కడ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.