రాష్ట్రంలోని దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలు, తొక్కిసలాట ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. గడిచిన ఏడాది కాలంలో మూడు ప్రధాన ఆలయాల్లో దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట, ఆ తర్వాత సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించడం.. ఇటీవలచోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా ఘటనలు రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆలయాల్లో తొక్కిసలాటలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోనుంది.ఈ కేబినెట్ సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖను ఆదేశించింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు, ఈ దాడులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మరోవైపు సందర్ఫంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తోపులాట కాస్త తొక్కిసలాటకు దారి తీసి.. 9 మంది భక్తులు చనిపోయారు.చోటుచేసుకుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని.. ప్రైవేట్ ఆలయమని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ ఆలయాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.