శుభవార్త.. పదేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నుంచి అదిరిపోయే ప్రకటన?

Wait 5 sec.

: భారతదేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబరులో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 0.25 శాతంగానే నమోదైంది. సెప్టెంబర్ నెలలో ఇది 1.44 శాతంగా ఉంది. అక్టోబరులో అంతకుమించి కిందికి పడిపోయందని చెప్పొచ్చు. గతేడాది అక్టోబరులో ద్రవ్యోల్బణం 6.21 శాతంగా ఉంది. 2015లో ప్రస్తుత డేటా సీపీఐ ఆధారంగా ద్రవ్యోల్బణం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి. ఇక్కడ ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇది కూడా జీఎస్టీ రేట్ల కోత కారణంగా జరిగింది.ఈ మేరకు NSO ద్రవ్యోల్బణం గణాంకాలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. >> సీపీఐ రిటైల్ ద్రవ్యోల్బణంలో దాదాపు సగం వాటా ఉన్న అక్టోబరు నెలలో -5.02 శాతంగా నమోదైంది. . దీనినే ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. ధరలు నిరంతరం తగ్గుతూ ఉంటే దానిని ప్రతి ద్రవ్యోల్బణంగా చెబుతుంటారు. ఇక ఇదే సమయంలో కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన చూస్తే 27.57 శాతం తగ్గాయి. ప్రధానంగా కార్ల నుంచి ఇతర రోజువారీ వినియోగ వస్తువులు దాదాపు అన్నింటిపైనా జీఎస్టీ రేట్లు భారీగా తగ్గించడంతో.. వాటి ధరలు దిగివచ్చాయి. దీంతో నూనెలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, కొవ్వు పదార్థాలు, రవాణా, చిరుధాన్యాలు, కమ్యూనికేషన్ వ్యయాలు ఇలా అన్నీ భారీగా తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ప్రాంతాల వారీగా చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ద్రవ్యోల్బణం -0.25 శాతంగా వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 0.88 శాతంగా ఉంది. అత్యధిక ద్రవ్యోల్బణం కేరళలో 8.56 శాతంగా ఉంది. ఇక అసోం, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, యూపీల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. ద్రవ్యోల్బణంపై.. ఆర్బీఐ లక్షిత పరిధిని (4 + or - 2 శాతం) 2-6 శాతంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుసగా ఏడో నెలా ఆర్బీఐ లక్ష్యం కంటే తక్కువగానే నమోదు కావడం ఊరట కల్పిస్తోంది. సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంటే.. కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. ఈ క్రమంలోనే డిసెంబరులో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC) జరగనుండగా.. మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్లను తగ్గించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్రా కూడా ఇదే జరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది . ఆర్బీఐ రెపో రేట్లను మరింత తగ్గిస్తే.. లోన్లపై వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని చెప్పొచ్చు.