హవా అంతా చైనాదే.. స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో వివో టాప్.. ఏ కంపెనీ ఏ స్థానంలో ఉందంటే?

Wait 5 sec.

: ఇప్పట్లో దాదాపు ప్రతి ఇంట్లో ఒకటికి మించి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. చదువుకునే చిన్న పిల్లల దగ్గర్నుంచి.. ముదుసలి వయస్సు వరకు వీటి వాడకం పెరిగిపోయింది. ఇక . క్రమక్రమంగా.. చైనా మొబైల్ తయారీ కంపెనీలు భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటాను మరింత పెంచుకుంటూ పోతున్నాయి. అవే ఆధిపత్యం చూపిస్తున్నాయి. ఇప్పుడు ఐడీసీ (ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ఇక్కడ అమ్మకాల పరంగా చూస్తే.. చైనాకే చెందిన వివో అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన శాంసంగ్, షావోమీ వంటి సంస్థలు తమ ప్రాభవం కోల్పోతున్నాయి. ఇక విలువ పరంగా ఇన్నాళ్లు మొదటి స్థానంలో చేరింది. అమ్మకాల పరంగా చూస్తే క్యూ3లో వివో అత్యధిక అమ్మకాలతో తొలి స్థానంలో నిలిచింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో వాటా ప్రస్తుతం 18.3 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో చూస్తే ఇది 15.8 శాతంగా ఉంది. విక్రయాలు 20.7 శాతం వృద్ధి చెందాయి. రెండో స్థానంలో కూడా చైనాకే చెందిన ఒప్పో ఉంది. దీని మార్కెట్ వాటా 13.9 శాతంగా ఉంది. విక్రయాలు 4.2 శాతం పెరిగాయి. సౌత్ కొరియా సంస్థ శాంసంగ్ మార్కెట్ వాటా 12.3 శాతం నుంచి 12.6 శాతానికి పెరిగింది. విక్రయాలు 6 శాతానికిపైగా పెరిగాయి. అమెరికాకు చెందినటువంటి 8.6 శాతం నుంచి 10.4 శాతానికి చేరింది. ఇక్కడ విక్రయాలు ఏకంగా 25 శాతానికిపైగా పెరగడం విశేషం. >> చైనాకు చెందిన ఇతర మొబైల్ కంపెనీలు రియల్ మీ, షావోమీ వాటా వరుసగా 11.5, 11.4 శాతాల నుంచి 9.8, 9.2 శాతాలకు పడిపోయాయి. ఇక్కడ విక్రయాలు కూడా వరుసగా 10.9 శాతం, 15.6 శాతం తగ్గాయి. అమెరికా సంస్థ మోటోరోలా మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. గతంలో 5.7 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 8.3 శాతానికి చేరింది. ఇక్కడ విక్రయాలు రికార్డు స్థాయిలో 52.4 శాతం పెరగడం విశేషం. చైనా సంస్థలు పోకో, ఐకూ వాటా కూడా గణనీయంగా తగ్గింది. అంతకుముందు వరుసగా 5.8, 4.2 శాతాలుగా ఉండగా.. ఇప్పుడు అది 4.3, 3.3 శాతాలకు దిగొచ్చాయి. విక్రయాలు కూడా 15 శాతానికిపైగా పడిపోయాయి. వన్ ప్లస్ (చైనా) వాటా 3.6 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గింది. విక్రయాలు 30 శాతానికిపైగా పడిపోయాయి. ఇతర కంపెనీల వాటా 7.5 శాతంగా ఉంది.