ఏపీ యువతకు శుభవార్త.. రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆ కోచింగ్ ఉచితం.. వసతి, భోజనం ఫ్రీగా.. దరఖాస్తు చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం 340 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు.అంతేకాదు వీరిలో మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఈ శిక్షణను విశాఖపట్నం, విజయవాడ,తిరుపతిల్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీ వరకు నాలుగు నెలల పాటు శిక్షణ అందిస్తారు. ఈ మేరకు అభ్యర్థులకు ఉచిత వసతితో పాటుగా భోజన సౌకర్యం కల్పిస్తారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటివి తెలుసుకోవడానికి ఏపీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్ అనే వెబ్‌సైట్‌ను చూడాలని సామాజిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు. అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుంది.. అలాంటిది ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితగా శిక్షణ అందించబోతోంది.ఇద్దరు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లుమరోవైపు ఏపీ ప్రభుత్వం వెయిటింగ్‌లో ఉన్న ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు పోస్ట్ ఇచ్చింది. జి.కృష్ణకాంత్‌ను శాంతిభద్రతల విభాగం ఏఐజీగా, ఏ.సురేష్‌బాబును ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు సీఎస్ కె విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఇద్దరు అధికారులు మొన్నటి వరకు వెయిటింగ్‌లో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం పోస్ట్‌లు ఇచ్చింది.