Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరిలని కార్ రెంటల్స్ కంపెనీ (Autoriders International Limited) తమ షేర్ హోల్డర్లను కోటీశ్వరులను చేసింది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై తమ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు జారీ చేయడానికి ఆమోదం తెలుపారని వెల్లడించింది. దీంతో చివరి ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్ 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ సైతం వెల్లడించింది. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత రెండేళ్లలోనే ఏకంగా 16,819 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. తమ షేర్ హోల్డర్ల తలరాతను మారుస్తూ కోటీశ్వరులను చేసింది. రెండేళ్ల క్రితం ఈ స్టాక్ లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పడి వరకు కొనసాగినట్లియితే ఆ షేర్ల విలువ ఇప్పుడు సుమారు రూ. 1.70 కోట్లు అవుతుంది. అందుకే దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. నవంబర్ 10 నాటి కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 5:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరును తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నట్లయితే వారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 ఈక్విటీ షేర్లను బోనస్ రూపకంగా ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు క్రితం రోజు ముగిసే నాటికి ఆటో రైడర్స్ ఇంటర్నేషనల్ షేరు 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ రూ. 5087.60 టచ్ చేసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర సైతం రూ. 5,087.60 కావడం గమనార్హం. అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 149.90 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 1 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 32 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 1285 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాదిలో 3294 శాతం లాభాన్ని అందించింది. గత రెండేళ్లలో 16,819 శాతం లాభాన్ని వాటాదారులకి అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 295 కోట్ల వద్ద ఉంది.