మహిళా సంఘాలకు శుభవార్త.. ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం.. 90 శాతం లోన్ కూడా

Wait 5 sec.

ప్రభుత్వం . రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే.. మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చూస్తుంది. అలానే మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించేందుకు గాను.. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతివ్వడమే కాక రుణం, సబ్సీడీ వంటివి కూడా అమలు చేస్తోంది. ఈక్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. వారు సంవత్సరానికి సుమారు 10 లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం వారికి 90 శాతం రుణ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇంతకు ఆ కార్యక్రమం ఏంటంటే..తెలంగాణ ప్రభుత్వం . వారిని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళలకు ఆర్థిక వృద్ధి మాత్రమే కాక పర్యావరణానికి కూడా మేలు జరుగుంది. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఉమ్మడి జిల్లాలో 4 గ్రామలను ఎంపిక చేసింది. మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం మహిళా గ్రామ సమాఖ్యలను ఎంపిక చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు కోసం.. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం గ్రామం, కల్లూరు మండలానికి చెందిన చిన్నకోరుకొండి గ్రామం, మణుగూరు మండలంలోని ఉడతనేనిగుంపు గ్రామం అలానే సుజాతనగర్‌ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామాలను ఎంపిక చేసింది.ఇలా ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో.. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసి.. విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. స్థలం ఎక్కడ ఎంపిక చేయాలనేది ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన సామాగ్రిని కాంట్రాక్టర్ అందిస్తారు. ప్లాంటు నిర్వహణ బాధ్యత మొత్తం ఎంపిక చేసిన మహిళా సంఘాల మీదనే ఉంటుంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం.. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన రెండు గ్రామాల్లో భూమి సాయిల్ పరీక్ష పూర్తి చేశారు. వీలైనంత త్వరగా ప్లాంటు నిర్మాణం ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.ఎంపికైన సమాఖ్యలో ఎంత మంది మహిళలైనా ఉండవచ్చు. ఒక్క ప్లాంటు నిర్వహణ కోసం రూ.2.97 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈమొత్తంలో 90 శాతం రుణం ఇస్తారు. మిగిలిన 10 శాతం సొమ్మును.. మహిళా సమాఖ్య పొదుపు సొమ్ము నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం చెల్లించడానికి పది సంవత్సరాల గడువు ఇస్తారు.ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును.. ఉత్తర డిస్కం ఎన్‌పీడీసీఎల్‌కి విక్రయించాలి. ఒక్కో యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లిస్తారు. లోన్ చెల్లించే సమయంలో సంవత్సరానికి ప్లాంటు మీద రూ.10 నుంచి రూ.20 లక్షల ఆదాయం రావచ్చని అధికారులు చెబుతున్నారు. లోన్ తీరాక రూ.50 లక్షలు ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు.