పాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ జట్లను స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. . తమ పాత టాలెంటెడ్ ప్లేయర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఇప్పటికే ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకున్న ముంబై జట్టు, ఇప్పుడు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో కొలకతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.ముంబై ఇండియన్స్ జట్టు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తిరిగి తమ జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కండే కేకేఆర్ జట్టులో ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు అతడిని క్యాష్ డీల్ ద్వారా కొనుగోలు చేయాలని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయి, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మయాంక్ మార్కండే 2018లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఐపీఎల్ అరంగేట్రం చేసి, ఆ సీజన్‌లో 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శనతో 2019లో భారత జట్టుకు ఆడే అవకాశం కూడా దక్కింది. అయితే, ఆ తర్వాత అతడి కెరీర్ ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 37 ఐపీఎల్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు. 2023, 2024 సీజన్‌లలో సన్‌రైజర్స్ తరఫున అతడి ప్రదర్శన మెరుగ్గా ఉన్నప్పటికీ, స్థిరంగా ఆడే అవకాశం రాలేదు. మయాంక్ మార్కండేతో పాటు, మరో మాజీ స్పిన్నర్ రాహుల్ చహార్ పైన కూడా ముంబై ఇండియన్స్ కన్నేసిందని వార్తలు వస్తున్నాయి. రాహుల్ చహార్ గతంలో ముంబై జట్టుకు ఐపీఎల్ 2020 టైటిల్ అందిచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 2025లో సన్‌రైజర్స్ తరఫున ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అతడి ధర రూ.3.2 కోట్లు కావడంతో, మార్కండేతో పోలిస్తే అతను ఖరీదైన ఆప్షన్. ముంబై ఇప్పుడు సన్‌రైజర్స్‌తో చర్చలు కొనసాగించాలా లేదా మార్కండేపైనే ఫోకస్ పెట్టాలా అనే నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో స్థానిక స్పిన్ ఆప్షన్లుగా విగ్నేష్ పుత్తూర్, కరణ్ శర్మ ఉన్నారు. విదేశీ స్పిన్నర్లుగా మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ అందుబాటులో ఉన్నారు. కానీ భారత స్పిన్ బౌలింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకోవడం ముంబైకు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మార్కండే లేదా చహార్ జట్టులో చేరితే, ముంబై ఇండియన్స్ స్పిన్ దళం మరింత బలంగా మారనుంది.