నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త.. కనీసం 8వ తరగతి చాలు.. ఇంటి వద్దే సంపాదన..

Wait 5 sec.

మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం ఒకటి. డిమాండ్ తక్కువ సరఫరా ఎక్కువగా ఉంటే.. వస్తువు రేటు ఎలా తగ్గిపోతుందో.. అలాగే ప్రతి ఏటా విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. అందుకు అనుగుణంగా ఉద్యోగాలు లేకపోవటంతో మన దేశంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. ఇక విద్యార్థులలోనూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే.. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాలలో సర్దుకుపోతుంటారు. మరికొందరు కొలువులు దక్కక ఇబ్బందులు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే.. పదో తరగతిలోపు చదువుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వాలతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు కూడా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకుకల్పిస్తోంది. కనీసం ఎనిమిదో తరగతి వరకూ చదివిన వారికి కూడా అవకాశం కల్పిస్తోంది చంద్రగిరిలోని యూనియన్‌ బ్యాంక్‌ . వివిధ అంశాలలో అందించి.. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ నెల రోజుల పాటు శిక్షణ అందించడంతో పాటుగా వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరోవైపు మహిళలు, పురుషులు ఇలా వేర్వేరుగా వివిధ కోర్సులలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ట్రైనింగ్ ఇస్తోంది. పురుషులకు సెల్ ఫోన్ సర్వీసింగ్, ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ, బైక్ సర్వీసింగ్, ఫ్రిజ్ రిపేర్ వర్క్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, సర్వీసింగ్ , వర్మీ కంపోస్ట్, లైట్ మోటార్ వాహనాలు డ్రైవింగ్ వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు.ఇక మహిళల విషయానికి వస్తే.. బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్స్ తయారీ, టైలరింగ్, కాస్ట్యూమ్స్ జ్యువెలరీ, అగరబత్తులు, మసాలాపొడులు, అప్పడాల తయారీ, కంప్యూటర్ నెట్ వర్కింగ్ వంటి కోర్సులలో ట్రైనింగ్ అందిస్తున్నారు. నెల రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందినవారు.. ఆ తర్వాత తమ అనుభవం ఆధారంగా సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇంటి వద్ద నుంచే స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్రైనింగ్ కోసం.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. అలాగే 19 నుంచి 45 ఏళ్ల మధ్య.వయస్కులై ఉండాలి. . మరిన్ని వివరాలకు చంద్రగిరిలోని యూనియన్‌బ్యాంక్‌ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణా సంస్థను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289, 63017 17672 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.