బంగారం ధరల్లో ఊహించని మార్పు.. రాత్రికి రాత్రే ఇలా జరిగిందేంటి.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Wait 5 sec.

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. కోలుకోలేని దెబ్బ పడిందనే చెప్పొచ్చు. కొంతకాలంగా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. గత 20 రోజుల వ్యవధిలో చూస్తే బంగారం ధర ఏకంగా రూ. 10 వేలకు పైగా పడిపోయింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగుముఖం పట్టడంతో ఇలా జరిగింది. ఇదే క్రమంలో ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ రేట్లు పెద్ద మొత్తంలో పతనం అయ్యాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక దశలో ఏకంగా 4380 డాలర్ల పైనికి చేరి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. సిల్వర్ రేటు కూడా 54 డాలర్ల స్థాయికి ఎగబాకింది. అక్కడినుంచి మళ్లీ అదే స్థాయిలో పడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా బంగారం ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఒక్కరోజులో రికార్డ్ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కిందటి రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4 వేల డాలర్ల స్థాయిలో కదలాడగా.. ఇప్పుడు అది 4140 డాలర్ల మార్కుకు చేరింది. అంటే ఇక్కడ ఒక్కరోజులోనే ఏకంగా 140 డాలర్లు పెరిగిందని చెప్పొచ్చు. స్పాట్ సిల్వర్ ధర కూడా భారీగా పెరిగి 51 డాలర్లకు చేరువైంది. ప్రధానంగా యూఎస్ షట్ డౌన్ నేపథ్యంలో అమెరికాలో ఇటీవల వినియోగం తగ్గింది. దీంతో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడింది. కొత్త ఉద్యోగాల్లోనూ అంచనాలు అందుకోలేదు. దీంతో మరోసారి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు తెలుస్తుంది. ఫెడ్ CME వాచ్ టూల్.. డిసెంబరులో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని 67 శాతం అవకాశాలున్నాయని చెప్పింది. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. బంగారం ధర పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందని తెలుస్తుంది.ఇదే క్రమంలో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజులో రూ. 1650 పెరిగింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ. 1,13,500 కు చేరింది. దీనికి ముందు 4 రోజులుగా ధర పెరగనే లేదు. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే ఒక్కరోజు రూ. 1800 పెరగ్గా 10 గ్రాములకు ఇప్పుడు రూ. 1,23,820 కి ఎగబాకింది.బంగారం ధరల బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఒక్కరోజే ఏకంగా రూ. 4 వేలు పెరిగింది. దీంతో ఇప్పుడు కేజీకి ఇది హైదరాబాద్ నగరంలో రూ. 1.69 లక్షలకు చేరింది. ఇది జీవన కాల గరిష్టాల నుంచి కిందటి రోజు వరకు ఏకంగా రూ. 42 వేలు తగ్గిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న వెండి ధర కిలోకు రూ. 2.07 లక్షల వద్ద ఉండేది.