జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా..!

Wait 5 sec.

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటింగ్‌ కోసం ఎన్నికల సంఘం నియోజకవర్గం పరిధిలో 407 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే ఉండనుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీత బీఆర్‌ఎస్ తరఫున, నవీన్‌ యాదవ్ కాంగ్రెస్ తరపున, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది.జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం ఎప్పుడూ ఒక కీలక అంశంగా మారుతోంది. గతంలో జరిగిన ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.58 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తక్కువ పోలింగ్‌ శాతం ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే, పార్టీలు తమ ఓటు బ్యాంక్‌ను పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నిక కోసం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకునేందుకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పటిష్ఠం చేశారు. ఓటు వేయడానికి 12 ఆప్షన్లుజూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.