బాలీవుడ్ లెజండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Wait 5 sec.

లెజెండరీ నటుడు, 'షోలే' స్టార్ ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన మంగళవారం ఈ లోకాన్ని విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయన్ని కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తరలించారు. ధర్మేంద్ర ఆరోగ్యం గురించి వార్తలు బయటకు రావడంతో అభిమానులు తీవ్రంగా కలత చెందారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అయితే వారి ప్రార్థనలు ఫలించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మంగళవారం ఉదయం ధర్మేంద్ర మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ధర్మేంద్ర మరణంతో భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన హిందీ నటుడైనా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భాషలకు అతీతంగా సినీ ప్రేక్షకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని సోమవారం వార్తలొచ్చాయి. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న ధర్మేంద్ర అక్టోబర్ 31న ఆస్పత్రికి వెళ్లగా ఆయనకు ఏమైందోనని అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా మరోసారి ఆయన ఆస్పత్రికి వెళ్లడంతో ఈ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఆ వార్తలను ధర్మేంద్ర టీమ్ ఖండించింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయనకు ఏం కాలేదని అభిమానులంతా ఊపిరి పీల్చుకుని కొద్ది గంటలు గడవకముందే ఆ లెజండరీ నటుడు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడన్న వార్త అందరినీ కలిచివేసింది.సుమారు ఆరు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతోన్న ధర్మేంద్ర కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 89 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబరు 8న ఆయన 90వ వసంతంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా ఈలోగా పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ధర్మేంద్ర కీలక పాత్ర పోషించిన ‘ఇక్కీస్‌’ సినిమా డిసెంబరు 25న విడుదల కాబోతోంది. పిన్న వయసులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ ఖేతర్‌ పాల్‌ బయోపిక్‌గా ఈ హిందీలో తెరకెక్కింది. ధర్మేంద్ర ఈ మూవీలో అరుణ్‌ ఖేతర్‌ పాల్‌ తండ్రి పాత్ర పోషించారు. పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.