తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఐదేళ్లలో రూ. 251 కోట్ల స్కామ్.. సిట్ దర్యాప్తులో సంచలనాలు

Wait 5 sec.

తిరుమల కేసును.. సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించింది సిట్. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల పాటు తిరుమల లడ్డూ తయారీ కోసం కి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు గుర్తించారు. బోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ.. ఈ కల్తీ నెయ్యిని టీటీడీకి పంపించినట్లు వెల్లడించారు. నెయ్యిని కల్తీ చేయడానికి 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్‌ కెర్న్‌ ఆయిల్, పామ్‌ స్టెరిన్‌ వంటి కొన్ని రసాయనాలు వినియోగించారని సిట్ తెలిపింది. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిని మరోసారి పరీక్షించినట్లు సిట్ తెలిపింది. గుజరాత్‌‌ ఆనంద్‌లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్‌‌ (NDDB CALF- సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్) ల్యాబ్‌లో టెస్ట్ చేసి.. ఈ ఏడాది మార్చి 27న కల్తీ జరిగినట్లు ధ్రువీకరించామని సిట్‌ వెల్లడించింది. మొత్తం కల్తీ అయిన నెయ్యిలో రూ. 137.22 కోట్లు విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని.. తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ ద్వారా బోలేబాబా కంపెనీ టీటీడీకి పంపింది. అయితే బోలేబాబా డెయిరీ నుంచి శ్రీవైష్ణవి డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసినట్లు.. ఆశిష్ అగర్వాల్ అనే వ్యక్తి సహాయంతో.. బోలేబాబా డెయిరీ నకిలీ రికార్డులు సృష్టించినట్లు సిట్ అధికారులు తెలిపారు. బోలేబాబాకు రూ. 251.53 కోట్లు..కాగా, మిగతా కల్తీ నెయ్యిని.. ఏఆర్‌ డెయిరీ, మాల్‌గంగా, బోలేబాబా సంస్థలు టీటీడీకి పంపినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ కల్తీ నెయ్యి సరఫరా ద్వారా బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌ రూ. 251.53 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఈ నవంబర్ 7న అరెస్టైన ఢిల్లీకి చెందిన అజయ్‌కుమార్‌ సుగంధ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. ఈ అజర్ కుమార్‌కు నెయ్యిన కల్తీ చేయడానికి అవసరమైన రసాయనాలను హర్ష్‌ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హర్ష్‌ ట్రేడింగ్‌ అనే రెండు కంపెనీలకు పంపాడని విచారణలో వెల్లడైంది. పంపినట్లు గతంలోనే సిట్ గుర్తించింది. ఈ రెండు కంపెనీల్లో పొమిల్, విపిన్‌ జైన్‌లు డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇలా చేయడం ద్వారా అజయ్‌ కుమార్‌కు రూ. 7.94 కోట్లు ముట్టజెప్పినట్లవు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏఆర్ డెయిరీ ద్వారా తిరుమల నాలుగు కిలోల కల్తీ నెయ్యి వచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. కానీ టీటీడీ వాటిని తిప్పి పంపించినట్లు వెల్లడించారు. అయితే బోలేబాబా డెయిరీ వాటినే.. శ్రీ వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ పంపిస్తే.. దాన్ని టీటీడీ అనుమతించినట్లు సిట్ పేర్కొంది.