తెలంగాణలో హోమ్‌స్టేల ఏర్పాటు.. ఇక ఇంటి నుంచే ఉపాధి.. వెంటనే అప్లై చేసుకోండి

Wait 5 sec.

పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. రాజుల కాలం నాటి కోటలు, గడీలు మాత్రమే కాక అటవీ ప్రాంతాలు, జలశయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇలా ఒక్కటేమిటి.. రాజధాని నగరం నుంచి అటవీ ప్రాంతాల వరకు అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అభివృద్ది చేస్తే పర్యాటక రంగం మీద తెలంగాణకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో పర్యటకాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ సర్కార్.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఆధ్యాత్మిక, చారిత్రక, అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసి.. పర్యాటకులను ఆకర్షించేలా వసతులు కల్పిస్తోంది. తాజాగా రూ.13 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.ఈక్రమంలో తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో . దీని వల్ల పర్యాటకులకు ఇంట్లో ఉన్న అనుభూతి కలగడమేకాక.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఇంటి నుంచే ఉపాధి లభించే అవకాశం కలగబోతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పర్యాటక శాఖ ప్రకటించింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా పర్యాటకులు రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాలు, టూరిస్ట్ ప్రదేశాలు, జిల్లా కేంద్రాల్లో హోమ్‌స్టేల ఏర్పాటుకుగాను తెలంగాణ పర్యాటక శాఖ ఆహ్వానం పలుకుతోంది. హోమ్‌స్టేల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ప్రైవేట్‌ పెట్టుబడిదారులు, వ్యక్తుల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా.. పర్యాటక శాఖ శుక్రవారం ప్రకటించింది. హోమ్‌స్టేల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవాలంటే.. వారికి రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న పర్యాటకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయని తెలిపింది.వివరాలు నింపి.. పూర్తి చేసిన దరఖాస్తులను డైరెక్టర్, పర్యాటక శాఖ, తెలంగాణ గవర్నమెంట్, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్‌- 500004 చిరునామాకు పంపించాలని సూచించింది. మరిన్ని వివరాలకు 040-23459282 నంబరుకు కాల్ చేయాల్సిందిగా తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హోమ్‌స్టే గదులను.. తెలంగాణ టూరిజం హోమ్‌స్టే ఎస్టాబ్లిష్‌మెంట్స్‌గా గోల్డ్, సిల్వర్ విభాగాలుగా విభజిస్తారని తెలిపింది. అలానే గోల్డ్ కేటగిరీకి అయితే నాలుగు వేల రూపాయలు.. సిల్వర్‌ కేటగిరీకి రూ.2 వేలు, ఫీజుగా పర్యాటక శాఖకు చెల్లించాలని పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పర్యాటక శాఖ ప్రకటించింది. దీని వల్ల నిరుద్యోగులకు వారు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించనుంది.