22k : అమెరికాలో సుదీర్ఘ షట్ డౌన్‌కు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. దాదాపు 43 రోజుల పాటు ఇది కొనసాగగా.. దీని ముగింపు బిల్లుపై బుధవారం రోజు ట్రంప్ సంతకం చేశారు. ఈ క్రమంలోనే.. అమెరికాలో కీలక ఉద్యోగ గణాంకాల రిపోర్ట్ (ఆర్థిక గణాంకాలు) విడుదల వాయిదా పడింది. ఇది మరోసారి అనిశ్చితిని సృష్టించింది. ఈ కారణంతోనే . సాధారణంగా మొన్నటి వరకు కచ్చితంగా.. ఫెడ్ ఈసారి డిసెంబరులో మళ్లీ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు అంచనాలు రాగా.. ఇప్పుడు ఇది వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫెడ్ అధికారులు తీవ్రమైన వ్యాఖ్యలు (హాకిష్ కామెంట్స్) చేసినట్లు సమాచారం. అంటే.. రేట్ల కోతకు మరికొంత సమయం పట్టొచ్చని లేదా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గించే యోచనలో లేదన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఒక్క కారణంతో బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న కారణంతోనే.. వారం రోజుల వ్యవధిలో రేటు దేశీయంగా, అంతర్జాతీయంగా విపరీతంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. అప్పుడు విపరీతంగా పుంజుకుంటుంది. . కానీ ఇప్పుడు అంచనాలు తప్పడంతో.. ప్రాఫిట్ బుకింగ్‌కు (లాభార్జన) దిగారు. ఈ క్రమంలో మరోసారి రేట్లు భారీ మొత్తంలో తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1450 తగ్గడంతో తులం రూ. 1,16,450 కి చేరింది. ముందటి రోజు ఇది రూ. 2850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 1580 పతనంతో 10 గ్రాములకు ప్రస్తుతం అది రూ. 1,27,040 కి చేరింది. మరోవైపు వెండి రేట్లు స్థిరంగానే ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, మరింత భారీగా పతనం కాగా.. ఈ ప్రభావం శనివారం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 100 పెరిగి రూ. 1,83,100 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఫెడ్ వడ్డీ రేట్ల వాయిదా ప్రభావం భారీగానే పడింది. కిందటి రోజు ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై (31.10 గ్రాములు) 4,200 డాలర్లపైన ట్రేడవగా.. ఇది అక్కడి నుంచి ఇంట్రాడేలో సుమారు 150 డాలర్లకుపైగా కుప్పకూలింది. చివరకు 120 డాలర్లు తగ్గి 4085 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక సిల్వర్ రేటు అంతకుమించి పడిపోయింది. 53 డాలర్ల స్థాయి నుంచి 50.60 డాలర్ల వద్ద సెషన్ ముగించింది. ఇక రూపాయి కూడా కాస్త పుంజుకుంది. డాలరుతో పోలిస్తే చివరకు 88.70 వద్ద స్థిరపడింది.