ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అసలు బొమ్మ చూపించిన పోలీసులు

Wait 5 sec.

"దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్".. అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇదే రేంజ్‌లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు.అయితే ఈ వార్నింగ్‌ని అంతే సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ని నిర్వహిస్తున్న రవి.. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా స్కెచ్‌తో రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని రవి ఆన్‌లైన్‌లో పెడుతున్నాడు.రవి తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఇక రవి అకౌంట్‌లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారట. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో పోలీసులకి కూడా రవి సవాల్ చేశాడు. ప్రస్తుతం సర్వర్లలో ఉన్న పైరసి కంటెంట్‌ని పోలీసులు చెక్ చేస్తున్నారు.