ఆంధ్రప్రదేశ్‌లో లులు ఎంట్రీ ఖాయమైంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. లో ముఖ్యమంత్రి చంద్రబాబు, లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్‌ అలీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, లులు సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. గత పాలకులు నిలిపివేసిన ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తిరిగి తీసుకురావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లులు మాల్ నిర్మాణం మూడేళ్లలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.. ఈ మాల్ కేవలం షాపింగ్ కేంద్రంగానే కాకుండా, విశాఖపట్నం పర్యాటక రంగానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మాల్స్‌ను నిర్వహిస్తున్న లులు సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇది రైతులకు మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మామిడి, జామ పల్ప్, మసాలా దినుసుల ఎగుమతికి రాష్ట్రం నుంచి సేకరిస్తామని, వచ్చే జనవరి నుంచి ఈ ఎగుమతులు ప్రారంభిస్తామని ప్రకటించింది. రాయలసీమలో లాజిస్టిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఎక్స్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ తెలిపారు. లులు సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రం నుంచి మామిడి, జామ పల్ప్, మసాలా దినుసులను సేకరించి ఎగుమతి చేస్తామని లులు సంస్థ వెల్లడించింది. ఈ ఎగుమతులు వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతాయి.లులు రాయలసీమ ప్రాంతంలో లాజిస్టిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఎక్స్‌పోర్ట్‌ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా ఎగుమతి ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. విశాఖపట్నంలో లులు సంస్థ ఒక భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. 13.83 ఎకరాల విస్తీర్ణంలో, 13.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో రూ.1,066 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌ను నిర్మిస్తారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.