బిహార్‌లో ఓటింగ్ 5 శాతం పెరిగిన ప్రతిసారీ అధికార మార్పిడి. ఇప్పుడూ అదే జరగబోతుందా?

Wait 5 sec.

యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరో? ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో? అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. నవంబరు 11న రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన. ఓ సర్వే అయితే ఏకంగా 150 నుంచి 170 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. అయితే, బిహార్ రాష్ట్ర ఎన్నికలో చరిత్రలోనే తొలిసారి రికార్డుస్థాయి ఓటింగ్ నమోదు కావడంతో అధికార కూటమిలో గుబులు రేపుతోంది. గతంలో ఓటింగ్ శాతం ఐదుకు మించి పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారడమే ఇందుకు కారణం. నవంబరు 6న జరిగిన తొలి దశలో 65.08 శాతం పోలింగ్ నమోదైతే.... రెండో దశలో దానిని మించి 68.76 శాతం మంది ఓటేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 57.29 శాతంతో పోల్చితే ఇది 9.62 శాతం అధికం.గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే ఓటింగ్ ఐదు శాతానికి మించి పెరిగిన మూడు సందర్భాల్లోనూ ప్రభుత్వాలు మారిపోయిన చరిత్ర ఉంది. తొలిసారి 1967 ఎన్నికల్లో అంతకు ముందు 1962లో నమోదయిన 44.5 శాతం కంటే 7 శాతం అధికంగా పోలింగ్ నమోదుకావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆ ఏడాది కాంగ్రేస్సేత పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.అలాగే, 1977లో నమోదయిన 50.5 శాతంతో పోల్చితే 1980లో 6.8 శాతం ( 57.5 శాతం) అధికంగా పోలింగ్ నమోదయ్యింది. ఈ సమయంలోనూ ప్రభుత్వం మారిపోయింది. 1990 ఎన్నికల్లోనూ మూడోసారి ఇదే ఫలితం పునరావృతమైంది. 1985లో 56. 3 శాతం పోలింగ్ నమోదుకాగా.. 1990లో 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారం కోల్పోయి.. జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ గతం కంటే దాదాపు 10 శాతం మేర అధికంగా పోలింగ్ నమోదుకావడం విశేషం. 1952లో బిహార్‌ రాష్ట్ర ఎన్నికలు మొదలైన తర్వాత ఈస్థాయిలో పోలింగ్ జరగడం ఇదే మొదటిసారి. కాగా, ఉందని పేర్కొన్నాయి.అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ నమోదుకావడం విశేషం. రెండో దశలో అత్యధికంగా కతిహార్ జిల్లా ప్రాణ్‌పూర్‌లో 81.02 శాతం.. అత్యల్పంగా పట్నా జిల్లాలోని కుమహ్రార్‌లో 39.57 శాతం పోలింగ్ నమోదయ్యింది. సెకెండ్ ఫేజ్‌లో అత్యధిక ఓటింగ్ నమోదయిన తొలి 10 నియోజకవర్గాల్లో ప్రాణ్‌పూర్ (కతిహార్) 81.02%, ఠాకూర్‌గంజ్ (కిషన్‌గంజ్) 80.51%, కోడ్వా (కతిహార్) 79.95%, కిషన్‌గంజ్ 79.62%, కోచధామన్ (కిషన్‌గంజ్) 79.15%, బరారీ (కతీహార్) 78.5%, బల్రామ్‌పూర్ (కతిహార్) 78.1%, బహదూర్‌గంజ్ (కిషన్‌గంజ్) 78.05%, కస్బా (పూర్ణియా) 77.8%, రూపౌలి (పూర్ణియా) 77.58% ఉన్నాయి.అత్యల్పంగా ఓటింగ్ నమోదయిన నియోజకవర్గాల్లో కుమహ్రార్‌ (పట్నా) 39.57%, దిఘా (పట్నా) 41.5%, బిహార్‌షరిఫ్ (నలంద) 55.09%, షాపూర్ (భోజ్‌పూర్) 57.11%, దరౌలి (సివాన్) 57%, జిరాడే (సివాన్) 57.17%, ఎక్మా (సరాన్) 58.35%, దానాపూర్ (పట్నా) 58.52%, చాప్రా (సరాన్) 58.61%, దరౌండా (సివాన్) 58.9% ఉన్నాయి. అయితే, పురుషుల (62.8 శాతం)తో మహిళలు (71.6 శాతం) ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారు.