కొత్త వాహనాలు కొనుగోలు చేసి వాటికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ రుసుములను ఏకంగా మూడు రెట్లు వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989'లోని నిబంధన 81కి సవరణ చేస్తూ రవాణా శాఖ శనివారం జీవో 77ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో.. ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఇందులో ప్రత్యేక నంబర్లకు చెల్లించాల్సిన కొత్త రేట్లను స్పష్టంగా వెల్లడించింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యమైన, అత్యధిక డిమాండ్ ఉన్న ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజులు భారీగా పెరిగాయి. 9999 నెంబర్‌కు గతంలో రూ. 50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 1.50 లక్షలకు పెంచారు. 0009.0001 నెంబర్‌కు గతంలో రూ. 50వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. లక్షకు పెంచారు. 6666 నెంబర్‌కు గతంలో రూ. 30 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.లక్షకు పెంచారు. 99, 999, 3333, 4444, 5555, 7777లకు: రూ.50 వేలు 5, 6, 7, 123, 333, 1234, 2727, 3456, 6789, 8888 నంబర్లకు: రూ.40 వేలు 3, 111, 234, 5678, 1818, 1999 నంబర్లకు: రూ.30 వేలు 2, 4, 8, 77, 786, 1233, 4567, 4777 వంటి నంబర్లకు: రూ.20 వేలు ఇతర నంబర్లకు(కార్లు,, ఇతర వాహనాలు): రూ.6 వేలు ఇతర నంబర్లకు(బైకులకు): రూ.3 వేలుఈ భారీ పెంపుదల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఫ్యాన్సీ నంబర్ల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు సరైనదేనని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక నంబర్లకు దరఖాస్తు, వేలం విధానంప్రత్యేక నంబర్లను కేటాయించే విధానంలో ఎటువంటి మార్పు లేదు, కానీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందిని అధికారులు వెల్లడించారు. వాహన యజమానులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులను తప్పనిసరిగా అనే అధికారిక పోర్టల్ ద్వారానే సమర్పించాలి. ఒకే ఫ్యాన్సీ నంబర్ కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పక్షంలో, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్ బిడ్డింగ్ (వేలం) నిర్వహిస్తారు.వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడిన వారికి ఆ నంబరు కేటాయించబడుతుంది.ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొని, నంబరు గెలవని వారికి వారు చెల్లించిన రిజర్వేషన్ రుసుములో 10 శాతం మినహాయింపు ఉంటుంది. మిగిలిన మొత్తం రీఫండ్ చేయబడుతుంది.ప్రత్యేక నంబరు కేటాయించిన తర్వాత, వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం యజమాని 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం వాహనాన్ని రవాణా కార్యాలయంలో చూపించాల్సి ఉంటుంది.నిర్దేశించిన 15 రోజుల గడువులోగా వాహనాన్ని చూపించడంలో విఫలమైతే, ప్రత్యేక నంబరు రిజర్వేషన్ రద్దవుతుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.ఈ కొత్త జీవోతో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరనుంది.