Top Workplaces: ఉద్యోగుల పని తీరు ఆధారంగానే కంపెనీ ఎదుగుదల ఉంటుంది. పని చేసే చోట గౌరవం, విశ్వాసం, తగిన గుర్తింపు ఉన్న చోట ఉద్యోగి ప్రదర్శన సైతం అదే స్థాయిలో ఉంటుంది. అలా ఉద్యోగులకు అనువైన పని ప్రదేశం కలిగిన కంపెనీల లిస్టును ఫార్య్చూన్ మీడియా ఓ నివేదిక తయారు చేసింది. ప్రపంచంలోనే బెస్ట్ వర్క్ ప్లేస్, 2025 పేరిట ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో 25 కంపెనీలు స్థానం సాధించాయి. మరి ఆయా కంపెనీల గురించి తెలుసుకుందాం. 2024-25 మధ్య కాలంలో ఫార్య్చూన్ మీడియా, గ్రేట్ వర్క్ ప్లేస్ టూ వర్క్ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. మొత్తం 90 లక్షల మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. సుమారు 2 కోట్ల మంది ఆయా సంస్థల్లో పని చేస్తున్నారు. కనీసం 5 వేల మంది పని చేసే కంపెనీలను ఈ లిస్టులో చేర్చారు. కంపెనీపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం, అనుకూల పని వాతావరణ, బహుళ దేశాల్లో బ్రాంచీల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లిస్ట్ తయారు చేశారు. ఆయా సంస్థలు ప్రాంతీయంగానూ మంచి పని వాతావరణ కల్పిస్తున్న వాటిని లిస్ట్‌లో చేర్చారు. టాప్-25 కంపెనీల లిస్ట్ ఇదే.. ఇందులో హిల్టన్, డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్, సిస్కో, యాక్సెంచర్, అబ్‌వీ, మారియెట్ ఇంటర్నేషనల్, టీపీ, సేల్స్ ఫోర్స్, స్ట్రైకర్, మెట్‌లెఫ్, స్పెక్ సేవర్స్, సీమెన్స్ హెల్త్ నీర్స్, సర్వీస్ నౌ, ఎక్స్ పీరియన్, ఎన్విడియా, కేడన్స్ ,డౌ, అలియాంజ్, వైయాట్రిస్, అడోబ్, క్రౌడ్ స్ట్రైక్, ఎస్‌సీ జాన్సన్, హిల్టి, ట్రెక్ బైస్కిల్, అడ్మిరల్ గ్రూప్ ఈ లిస్టులో ఉన్నాయి. టీపీ, సీమెన్స్ హెల్త్ నీర్స్, స్పెక్ సేవర్స్, ఎక్స్ పీరియన్, అలియాంజ్, వయాట్రిస్, డౌ, క్రౌడ్ స్ట్రైక్, ట్రెక్ బైస్కిల్, అడ్మిరల్ గ్రూప్ మినహా మిగిలిన పై కంపెనీలన్నీ భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.