బంపర్ ఆఫర్.. 100 షేర్లు కొంటే 500 షేర్లొస్తాయ్.. లక్షను రూ.10 లక్షలు చేసిన స్టాక్ ఇదే

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని కన్సూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ కంపెనీ సీడబ్ల్యూడీ లిమిటెడ్ () బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. నవంబర్ 14వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తమ షేర్ హోల్డర్లకు జారీ చేయడానికి ఆమోదం లభించింది. దీంతో శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్ 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం, ప్రతి 100 షేర్లకు మరో 400 షేర్లు ఉచితంగా లభిస్తాయి. మరోవైపు ఈ కంపెనీ గత ఏడాదిలో 163 శాతం లాభాన్ని అందించింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నవంబర్ 14వ తేదీన జరిగిన సీడబ్ల్యూడీ లిమిటెడ్ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 4:1 రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని కొనుగోలు చేసి డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్న వారికి అదనంగా రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉండే 4 ఈక్విటీ షేర్లను బోనస్‌గా అంటే ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్ల రికార్డు డేట్ త్వరలోనే నిర్ణయించనున్నట్లు కంపెనీ తెలిపింది.శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో సీడబ్ల్యూడీ షేరు 5 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి రూ. 1790 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 1790, కనిష్ఠ ధర రూ. 590 వద్ద ఉన్నాయి. గత ఆరు నెలల్లో 106 శాతం లాభాన్ని అందించింది. ఇక గత ఏడాది కాలంలో 163 శాతం లాభాన్ని అందించింది. గత ఐదేళ్లలో 894 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయల పెట్టుబడిని దాదాపు రూ.10 లక్షలు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 780 కోట్ల వద్ద ఉంది. ఈ స్టోరీ కేవలం సమచారం అందించేందుకే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే హైరిస్క్ తీసుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఇక్కడ తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టం ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి.