IPL 2026 ముంబై ఇండియన్స్ ప్లేయర్ల రిలీజ్ & రిటెన్షన్ లిస్ట్? మెగా వేలానికి రోహిత్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్!

Wait 5 sec.

ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు 2025 సీజన్‌లో మళ్లీ తన పాత జోష్‌ని చూపించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆరంభంలో తడబడినా చివరికి లీగ్ దశను నాలుగో స్థానంతో ముగించి ప్లే ఆఫ్స్‌కి చేరింది. 2024లో నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత ముంబైకి ఇది ఒక పాజిటివ్ రిటర్న్‌గా నిలిచింది. హార్దిక్ కెప్టెన్సీపై ప్రారంభంలో విమర్శలు వచ్చినా, ఒత్తిడిని ఎదుర్కొనే ధోరణి, వ్యూహాత్మక నిర్ణయాలు అతని నాయకత్వాన్ని బలపరిచాయి. నవంబర్ 15 రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను విడుదల చేసే అవకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. కేవలం బ్యాటర్‌గా ఆడిన 15 మ్యాచ్‌ల్లో 418 పరుగులు సాధించి, సుమారు 150 స్ట్రయిక్‌రేట్‌తో నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇది ఆయన ఫామ్ ఇంకా నిలకడగా ఉందని సూచిస్తోంది. అయితే వయస్సు, జట్టు కొత్త దిశలో అడుగులు వేస్తోందనే కారణాలతో ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మాజీ భారత బ్యాటర్ సురేష్ రైనా ఈ అంశంపై తన అభిప్రాయం వెల్లడిస్తూ “రోహిత్‌ను కచ్చితంగా రిటైన్ చేయాలి. ఆయన ముంబైకి ఎన్నో ట్రోఫీలు అందించాడు” అని తెలిపాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ట్రేడ్ మార్కెట్‌లో కూడా చురుకుగా ఉన్నట్లు సమాచారం. పెద్దగా ఆకట్టుకోలేక పోయిన దీపక్ చాహర్‌ను వదిలేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అలాగే జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను బలోపేతం చేయడానికి ఓవర్సీస్ ఆటగాళ్ల మార్పిడి అవకాశాలు కూడా పరిశీలిస్తోంది. ముంబై ఇండియన్స్ తమ బలమైన భారత కోర్‌ను పెద్దగా మార్చే అవకాశం లేదు. జట్టు ప్రధాన స్తంభాలు అయిన జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు నిర్ధారణగా కొనసాగుతారని భావిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లలో ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్‌లను కూడా రిటైన్ చేసే అవకాశముంది, ఎందుకంటే వారు 2025 సీజన్‌లో కీలక పాత్ర పోషించారు.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్ల అంచనాహార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, వినేష్ పుతూర్, కరణ్ శర్మ, మిచెల్ శాంట్నర్, అర్జున్ టెండూల్కర్, విల్ జాక్స్, రాబిన్ మిన్జ్, నామన్ ధీర్, ఏఎం ఘజన్‌ఫర్, రయాన్ రికెల్టన్, అశ్విని కుమార్.ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే ఆటగాళ్ల అంచనారీస్ టాప్లీ, దీపక్ చాహర్, కృష్ణన్ శ్రీజిత్, సత్యనారాయణ రాజు, బెవన్ జేకబ్స్, లిజాడ్ విలియమ్స్, రాజ్ బావా.