22k Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్. గత 25 రోజుల వ్యవధిలో . దీంతో కొనుగోలు దారులకు ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా 25 రోజుల కిందట అక్టోబర్ 17న దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 4400 డాలర్ల స్థాయిలో కదలాడింది. దేశీయంగా కూడా బంగారం ధర 22 క్యారెట్లపై 1.21 లక్షలు, 24 క్యారెట్లపై 1.31 లక్షలు దాటి ట్రేడయింది కూడా. దీంతో కొనుగోలుదారులకు భయం పట్టుకుంది. అయితే అక్కడి నుంచి వరుసగా గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అక్కడి నుంచి ధర వరుసగా పడిపోయింది. దేశీయంగా సుమారు రూ. 10 వేలకుపైగా పడిపోగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో 400 డాలర్ల వరకు తగ్గుముఖం పట్టింది. అయితే మళ్లీ 2 రోజులుగా రేట్లు పెరుగుతున్నాయి. అది కూడా భారీ స్థాయిలో కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,130 డాలర్ల స్థాయికి చేరింది. అంటే 2 రోజుల్లో 100 డాలర్లకుపైగా ఎగబాకిందన్నమాట. సిల్వర్ రేటు చూస్తే 51.30 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 88.47 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి.. చైనా బంగారం కొనుగోళ్లను పెంచడం. వరుసగా 12 నెలలో (అక్టోబర్) కూడా చైనా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంది. ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెంచింది... డిసెంబరులో మరోసారి తగ్గించనున్నట్లు అంచనాలు పెరిగిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే కూడా బంగారం ధర పెరుగుతుందని చెప్పొచ్చు. దీంతో ఇటువైపు మళ్లీ పెట్టుబడులు పెరగడంతో బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. దేశీయంగా గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఒక్కరోజులోనే రూ. 1850 పెరగడంతో తులం రూ. 1,15,350 కి చేరింది. దీనికి ముందటి రోజు రూ. 1650 పెరిగింది. ఇలా 2 రోజుల్లోనే రూ. 3500 పెరిగిందని చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2020 పెరిగి 10 గ్రాములకు రూ. 1,25,840 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 1800 పెరిగింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. రూ. 1000 పెరిగి కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 1.70 లక్షలు పలుకుతోంది. కిందటి రోజు రూ. 4 వేలు పెరిగింది.