భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్.. లంచ్‌కు ముందే టీ బ్రేక్.. ఎందుకో తెలుసా?

Wait 5 sec.

: సొంతగడ్డపై టీమిండియా.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. . తొలి టెస్టుకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా.. రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గువాహటిలో (అసోం) జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ 2025-27లో భారత్‌కు ఇది మూడో సిరీస్ కాగా.. సౌతాఫ్రికాకు రెండో సిరీస్. భారత్ తొలుత ఇంగ్లాండ్‌తో వారి గడ్డపై 2-2తో సిరీస్ డ్రా చేసుకోగా.. సొంతగడ్డపై విండీస్‌ను 2-0 తో ఓడించింది. మరోవైపు సౌతాఫ్రికా.. పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌ను 1-1 తో డ్రా చేసుకుంది. దీంతో.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ముందుకెళ్లేందుకు రెండు జట్లకు ఈ సిరీస్ కీలకంగా ఉండనుందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు జట్లు.. టెస్ట్ సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభించాయి. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే గువాహటిలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్‌లో బీసీసీఐ ఒక అసాధారణమైన మార్పును ప్రకటించింది. ఈశాన్య భారతదేశంలో సాయంత్రం వేళల్లో త్వరగా చీకటి పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు.. బీసీసీఐ సంప్రదాయ టెస్ట్ క్రికెట్ విరామ సమయాల్ని మార్చింది. దీంతో ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌లో.. లంచ్ బ్రేక్ కంటే ముందుగానే టీ బ్రేక్ తీసుకోనున్నారు. సాధారణంగా ఈ విధానం డే అండ్ నైట్ టెస్టుల్లో ఉంటుంది. అక్కడ ముందుగా టీ బ్రేక్ తర్వాత డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు డే మ్యాచ్‌లో లంచ్ బ్రేక్ కంటే ముందే టీ విరామం తీసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ కార్యదర్శి, గువాహటికే చెందిన దేబజిత్ సైకియా ఈ మార్పుల్ని ధ్రువీకరించారు. కోల్‌కతాలో జరిగే తొలి టెస్టు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. దాని కంటే అరగంట ముందే అంటే ఉదయం 9 గంటలకే గువాహటిలో మ్యాచ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. 'శీతాకాలంలో, ఈశాన్య భారతదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా త్వరగా జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకే వెలుతురు తగ్గిపోతుంది. తర్వాత ఎక్కువసేపు ఆడలేం. అందుకే ఉదయం 9 గంటలకే ఆట ప్రారంభించాలని నిర్ణయించాం.' అని సైకియా తెలిపారు. గుహవాటి టెస్ట్ షెడ్యూల్..ఉదయం 8.30 గంటలకు టాస్ఉదయం 9- 11 గంటల మధ్య తొలి సెషన్ 2 గంటలు సాగుతుంది.తర్వాత 20 నిమిషాలు అంటే 11.20 గంటల వరకు టీ విరామం11.20-1.20 గంటల మధ్య రెండో సెషన్ నిర్వహిస్తారుమధ్యాహ్నం 1.20-2 గంటల వరకు లంచ్ బ్రేక్- 40 నిమిషాలుమధ్యాహ్నం 2-4 గంటల వరకు మూడో సెషన్ ఉంటుంది. ఓవర్ల కోటా పూర్తి కాకుంటే అదనంగా అరగంట సమయం అంటే 4.30 గంటల వరకు అవకాశం కల్పిస్తారు.అంటే ఇక్కడ మొదటి సెషన్ ఉదయం 11 గంటలకే పూర్తవుతున్నందున అప్పుడు లంచ్ బ్రేక్ అనేది చాలా త్వరగా అవుతుందని భావించిన బీసీసీఐ.. సెషన్ మధ్య విరామాల్ని అటుఇటుగా మార్చిందని తెలుస్తోంది. ఈ సిరీస్ హైలైట్స్‌ను గెలవలేదు. చివరిసారి 1999/2000 లో హాన్సీ క్రాంజే నాయకత్వంలో దక్షిణాఫ్రికా.. భారత్‌ను 2-0 తో ఓడించింది. గత సిరీస్ విషయానికి వస్తే.. 2019/20లో భారత్‌లో పర్యటించిన సౌతాఫ్రికా.. 0-3 తో సిరీస్‌ను కోల్పోయింది. ఓవరాల్‌గా 2 జట్ల మధ్య 44 టెస్టులు జరగ్గా.. సౌతాఫ్రికా 18 గెలిచింది. ఇండియా 16 టెస్టుల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ గడ్డపై చూస్తే.. 19 టెస్టుల్లో.. ఇండియా 11, సౌతాఫ్రికా 5 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 3 టెస్టులు డ్రా అయ్యాయి.