: కార్ల అమ్మకాల్లో అక్టోబర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు జరిగాయని చెప్పొచ్చు. పండగ సీజన్‌లో సాధారణంగానే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో ఇటీవల . చిన్న కార్లపై జీఎస్టీ రేట్లు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం, సెస్ తొలగించడం సహా పండగ సీజన్‌లో కార్ల తయారీ కంపెనీలు అదనపు డిస్కౌంట్లు ప్రకటించడంతో రేట్లు భారీగా దిగొచ్చాయి. దాదాపు అన్ని కంపెనీలు కూడా అక్టోబర్ నెలలో గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే వాహన విక్రయాల్లో వృద్ధి కనబరిచాయి. టాటా మోటార్స్ విక్రయాల్లో 27 శాతం వృద్ధి కనిపించగా.. ఇదే సమయంలో మారుతీ సుజుకీ విక్రయాలు 7 శాతం పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 26 శాతం విక్రయాల్ని పెంచుకుంది. హ్యుందాయ్, టయోటా, కియా.. ఏకంగా 30 శాతానికిపైగా వృద్ధిని కనబరిచాయి. జీఎస్టీ రేట్ల కోతతో ప్రధానంగా.. చిన్న కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే సమయంలో సబ్ కాంపాక్ట్ SUV విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు మనం అక్టోబరు నెలలో అత్యధికంగా అమ్ముడుబోయిన టాప్- 10 కార్లు ఏంటి.. ఎన్ని విక్రయాలు నమోదు చేసిందనే దాని గురించి చూద్దాం. ఈ లిస్టులో మారుతీ సుజుకీ 6 మోడల్స్ ఉండగా.. టాటా మోటార్స్ మాత్రం టాప్‌లో నిలిచింది. .2025 అక్టోబర్ నెలలో ఏకంగా 22,083 యూనిట్లను విక్రయించి టాప్‌ ప్లేస్‌లో ఉంది. 2024 అక్టోబరులో ఈ సంఖ్య 14,759 ఉండగా.. వృద్ధి 50 శాతంగా ఉంది. మారుతీ సుజుకీ డిజైర్ 20,791 విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. ఇది 64 శాతం వృద్ధి నమోదు చేసింది. మారుతీ సుజుకీ ఎర్టిగా 20,087 కార్లను విక్రయించి టాప్-3లో నిలిచింది. 18,970 కార్లను విక్రయించిన మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ నాలుగో స్థానంలో ఉండగా.. హ్యుందాయ్ క్రెటా (క్రెటా N లైన్ + క్రెటా ev) 18,381 విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. >> మహీంద్రా స్కార్పియో (స్కార్పియో క్లాసిక్ + స్కార్పియో N) 17,880 విక్రయాలతో ఆరో స్థానంలో నిలిచింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (17,003), మారుతీ సుజుకీ బాలెనో (16,873), టాటా పంచ్ (ICE+EV- 16,810), మారుతీ సుజుకీ స్విఫ్ట్ (15,542) తర్వాత వరుసగా ఉన్నాయి. టాప్-10లో స్విఫ్ట్ విక్రయాలు మాత్రమే అంతకుముందు ఏడాది ఇదే సమయంతో చూస్తే.. 11 శాతం తగ్గాయి.