: . ఈ బ్యాంకుకు కోట్లల్లో కస్టమర్లు ఉంటారు. నిత్యం వందలు, వేలల్లో జనం ఈ బ్యాంకు బ్రాంచుల్ని సందర్శిస్తుంటారు. ఇక ఇది ఎన్నో రకాల సేవల్ని అందిస్తుంటుంది. బ్యాంకుల్లో డబ్బులు జమ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లోన్లు, చెక్ ‌బుక్స్, పాస్ బుక్స్, ప్రభుత్వ పథకాలు అందిస్తోంది. ఇంకా.. కాలం మారుతున్న కొద్దీ.. డిజిటల్ రూపంలోనే రోజురోజుకూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వేర్వేరు యాప్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్లకు సంబంధించి.. ఒక రకమైన సేవల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అదే ఎస్బీఐ ఎం- క్యాప్ సర్వీస్. నవంబర్ 30 తర్వాత ఇది పనిచేయదని పేర్కొంది. >> ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి mCash (డబ్బులు పంపించడం, క్లెయిమ్ చేయడం) సేవలు నవంబర్ 30 తర్వాత అందుబాటులో ఉండవు. అసలు ఎం క్యాష్ అనేది.. ఎస్బీఐ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్‌ను ముందే నమోదు చేయకుండా కూడా.. కేవలం వారి మొబైల్ నంబర్, ఇ- మెయిల్ ఐడీ ఉపయోగించి డబ్బులు పంపొచ్చు, స్వీకరించొచ్చు. ఇది త్వరలో నిలిపివేయబడుతుంది. ఈ క్రమంలోనే ఎం క్యాష్ సేవలు నిలిచిపోనుండగా.. కస్టమర్లు థర్డ్ పార్టీ అకౌంట్లకు నిధులు బదిలీ చేసేందుకు ఇతర సురక్షితమైన, విస్తృతంగా ఉపయోగించేటువంటి డిజిటల్ పద్ధతుల్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో యూపీఐ, RTGS, IMPS, NEFT వంటివి ఉన్నాయి. వీటి గురించి చూద్దాం.ఎం క్యాప్ మాదిరిగానే.. యూపీఐ ద్వారా పంపించేందుకు బెనిఫిషియరీని ముందుగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. BHIM SBI Pay యాప్ లేదా యోనో లేదా యోనో లైట్ ద్వారా మొబైల్ నంబర్ లేదా అకౌంట్ వివరాలతో ఈజీగా డబ్బులు పంపొచ్చు. ఐఎంపీఎస్ ద్వారా అయితే.. 24x7 ఎప్పుడైనా బ్యాంకుల మధ్య నగదు బదిలీ జరుగుతుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ లబ్ధిదారుడి అకౌంట్ నంబర్, IFSC కోడ్ ద్వారా పంపేందుకు వీలుంటుంది. NEFT విషయానికి వస్తే.. వివిధ బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీకి ఇది సురక్షితం. ఇక పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు RTGS ఉపయోగించొచ్చు. ఇక్కడ సెటిల్మెంట్ దాదాపుగా రియల్ టైంలోనే జరుగుతుంది.