: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడుతీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించగా.. 29 మంది గాయపడ్డారు. భారీ పేలుడు కారణంగా ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉండవచ్చు అనే ఊహాగానాలు వ్యాపించాయి. అయితే ఈ ఊహాగానాలను జమ్మూ కాశ్మీర్ డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నలిన్ ప్రభావత్ పూర్తిగా తోసిపుచ్చారు. డీజీపీ నలిన్ ప్రభావత్ మీడియాతో మాట్లాడుతూ.. "ఈ పేలుడు ఉగ్రవాదులు చేసిన దాడి కాదు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగింది" అని స్పష్టం చేశారు. పేలుడుకు సంబంధించిన పరిస్థితులను, దర్యాప్తు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.శాంపిల్స్ తీస్తుండగా జరిగిన విస్ఫోటనం..నౌగామ్ పోలీస్ స్టేషన్‌లోని అధికారులు ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఛేదించిన ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన కీలకమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఉన్న ఈ పేలుడు పదార్థాల నుంచి ఫోరెన్సిక్ పరీక్షల కోసం శాంపిల్స్ (నమూనాలు) తీస్తున్న సమయంలోనే ఊహించని విధంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పోలీస్ స్టేషన్ భవనం దెబ్బతినడమే కాకుండా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పేలుడు ధాటికి శిథిలాలు, శరీర భాగాలు వందల మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి.మేమే కారణం అంటూ ఉగ్రసంస్థ ప్రకటన..అధికారులు భావిస్తుండగా.. పీపుల్స్-యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ (PAFF) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ పీఏఎఫ్ఎఫ్ సంస్థ.. పాకిస్థాన్ ఆధారిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు అనుబంధంగా పని చేస్తుందని భద్రతా సంస్థలు గుర్తించాయి. అయితే డీజీపీ నలిన్ ప్రభావత్ ఈ ఉగ్ర సంస్థ చేసిన ప్రకటనను ఖండించారు. వారు కేవలం గందరగోళం సృష్టించడానికి, భయాందోళనలు రేకెత్తించడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తమ దర్యాప్తులో స్పష్టంగా ఇది సాంకేతిక కారణాల వల్ల జరిగిన ప్రమాదంగా తేలిందని ఆయన బలంగా చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఉగ్ర కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేసినప్పటికీ.. ఈ పేలుడు ప్రమాద వశాత్తే జరిగినట్లు తేలిందని వెల్లడించారు.