ముఖ్యంగా సంజు శాంసన్ - రవీంద్ర జడేజా, సామ్ కరన్‌తో కూడిన బిగ్గెస్ట్ డీల్ ఎన్నో ట్విస్టుల మధ్య మొత్తానికి పూర్తయింది. వీళ్లతో పాటు సన్‌రైజర్స్ కీలక పేసర్ మొహమ్మద్ షమీ, మయాంక్ మార్కండే, అర్జున్ టెండూల్కర్, నితీష్ రాణా, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా ట్రేడ్ డీల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. రూధర్‌ఫోర్డ్, శార్ధూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ ఇంతకు ముందే దక్కించుకోవడం విశేషం. రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ జట్ల మధ్య జరిగిన కొన్ని కీలక మార్పులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ అధికారికంగా ప్రకటించింది. రాబోయే సీజన్‌కు ముందుగా ఫ్రాంఛైజీలు పరస్పర అంగీకారంతో చేపట్టిన ఈ ట్రేడ్‌లు సీజన్‌ను మరింత ఆసక్తిగా మార్చనున్నాయి. ఏ ప్లేయర్‌ను ఏ జట్టు దక్కించుకుంది? ఎంత ధరకు తీసుకుంది? అనే వివరాలు కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రవీంద్ర జడేజాసీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ట్రేడ్‌ల్లో అత్యంత ప్రాధాన్యమైన ఆటగాడిగా నిలిచాడు. 12 సీజన్లపాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక ఆటగాడిగా రాణించిన జడేజా, విజయవంతమైన ట్రేడ్ ఒప్పందంతో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడనున్నాడు. ఈ మార్పులో భాగంగా అతని లీగ్ ఫీజు రూ.18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గింది. 250కుపైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడేజా అనుభవం రాయల్స్‌కు పెద్ద బలం కానుంది.సంజు శాంసన్రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌ను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. సంజు శాంసన్ తన ప్రస్తుత రూ.18 కోట్ల ఫీజుతో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరాడు. 2013లో అరంగేట్రం చేసినప్పటి నుంచి శాంసన్ 177 మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ, రాజస్థాన్ తర్వాత సంజుకు సీఎస్‌కే అతని కెరీర్‌లో మూడో ఫ్రాంచైజీగా నిలుస్తుంది. సామ్ కరన్ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు మారాడు. రూ.2.4 కోట్ల ప్రస్తుత ఫీజుతో ఇదే అతని మూడో ఫ్రాంచైజీ కానుంది. 64 మ్యాచ్‌ల అనుభవం ఉన్న కరన్ పంజాబ్ కింగ్స్, సూపర్ కింగ్స్ తరఫున ఆడిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.మొహమ్మద్ షమీసీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరో కీలక ట్రేడ్‌లో భాగమయ్యాడు. 2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.10 కోట్లకు దక్కించుకున్నప్పటికీ, ఒక్క సీజన్‌కే వదిలేసింది. ఈ ట్రేడ్‌లో షమీని లక్నో దక్కించుకుంది. 119 మ్యాచ్‌లు ఆడిన షమీకి ఐదు ఫ్రాంచైజీల పరిచయం ఉంది. 2023లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న షమీ, 2024 సీజన్‌ను గాయం కారణంగా కోల్పోయినప్పటికీ, అతని అనుభవం లక్నోకు భారీ బలం అవుతుంది.మయాంక్ మార్కండేలెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్‌ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, ఇప్పుడు విజయవంతమైన ట్రేడ్‌తో ముంబైకి చేరాడు. అంతకుముందు మూడు సీజన్లపాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మార్కండే, ఇప్పటి వరకు 37 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కి మారాడు. గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్‌లో ఉన్న అతడు, ఇప్పుడు రూ.30 లక్షల ప్రస్తుత ఫీజుతో ఎల్ఎస్‌జీ తరఫున ఆడనున్నాడు. 2023లో ఐపీఎల్ డెబ్యూ చేసిన అర్జున్, లక్నోలో మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంది.ఢిల్లీకి నితీష్ రాణాలెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి విజయవంతమైన ట్రేడ్ తర్వాత అతను తన ప్రస్తుత రూ.4.2 కోట్ల ఫీజుతో డీసీ జట్టులో ఆడనున్నాడు. 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా, 100కు పైగా మ్యాచ్‌లు ఆడి గొప్ప అనుభవాన్ని సంపాదించాడు.డొనోవన్ ఫెరీరాదక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా తన మొదటి ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన ఈ ట్రేడ్ ఒప్పందంతో అతని ఫీజు రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికు పెరిగింది. రాయల్స్ జట్టులో అతని ఆల్‌రౌండ్ సామర్థ్యం ప్రధాన పాత్ర పోషించనుంది. ఠాకూర్, రూధర్‌ఫోర్డ్టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్, వెస్టిండీస్ ప్లేయర్ రూధర్‌ఫోర్డ్ ట్రేడ్ డీల్ వీళ్లందరి కంటే ముందుగానే జరిగింది. ఈ ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకోవడం విశేషం. శార్ధూల్ ఠాకూర్‌ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్ ద్వారా లక్నో నుంచి రూ.2 కోట్లకు దక్కించుకుంది. అదేవిధంగా రూధర్‌ఫోర్డ్‌ను కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ గుజరాత్ నుంచి రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకుంది.