Tirumala: పుణెకు చెందిన భక్తుడి పెద్దమనసు.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు శ్రీవారికి తమకు తోచిన విధంగా కానుకలు అందజేస్తుంటారు. కొంతమంది భక్తులు బంగారం, వెండి వంటివి ఇస్తారు. కొందరు భక్తులు టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు. ఇంకొందరు వాహనాలను టీటీడీకి విరాళంగా అందజేస్తుంటారు. ఈ వాహనాలను టీటీడీ ఆయా అవసరాలకు తగిన విధంగా ఉపయోగిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు బస్సును అందజేశారు. 'కి ఎలక్ట్రిక్ బస్సు విరాళంగా అందింది. పుణెకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్‌ బస్సును శనివారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్ పోర్ట్ డిఐ వెంక‌టాద్రి నాయుడు పాల్గొన్నారు' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ బస్సును భక్తుల కోసం ధర్మ రథం కింద ఉపయోగిస్తారు. టీటీడీ కార్తీక దీపోత్సవం'తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీ రాఘవేంద్ర వేదస్వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు' అని తెలిపారు.'అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన “శ్రీ లక్ష్మి ఆవిర్భవం” నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. తరువాత భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది' అని ప్రకటనలో తెలియజేశారు. వేదపాఠశాల విద్యార్థులకు వస్త్రాల పంపిణీ'తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు. సంవత్సరానికోసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, ఒక దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు' అని తెలిపారు.