: స్టాక్ మార్కెట్‌‍లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం సైతం పలు కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తున్నాయి. మొత్తం 5 ఐపీఓలు ఉండగా అంులో మూడు మెయిన్ బోర్డు కేటగిరీ నుంచి రెండు ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి ఉన్నాయి. ఆయా కంపెనీల సబ్‌స్క్రిప్షన్లు నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య జరగనున్నాయి. ఈ ఐదు కంపెనీలు మొత్తం కలిపి రూ.10,000 కోట్లకు పైగా సమీకరించే లక్ష్యంతో ఉన్నాయి. ఎడ్యుకేషన్, హరిత ఇంధనం నుంచి ఆటోమోటివ్ టెక్నాలజీ, ఫార్మా రంగాల వరకు ఈ కంపెనీలు విస్తరించి ఉన్నాయి. మరి ఆయా కంపెనీల పబ్లిక్ ఇష్యూల గురించి తెలుసుకుందాం. ఫిజిక్స్ వాలా ఐపీఓ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 11న మొదలై 13వ తేదీ వరకు కొనసాగుతుంది. షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.103-109గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా రూ.3480 కోట్లు సమీకరించనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈ రెండింటిలోనూ లిస్టింగ్ కానుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ ఈ పబ్లిక్ ఇష్యూను నిర్వహిస్తోంది. టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా ఐపీఓఆటోమోటివ్ సిస్టమ్స్ లీడర్ టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా (Tenneco Clean Air India) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,600 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే షేర్లు విక్రయిస్తోంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 12న మొదలై 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో షేరుకు రూ.378-397గా నిర్ణయించారు. ఎమ్వీ ఫోటోవోల్టాయిక్ పవర్ ఐపీఓఎమ్వీ ఫోటోవోల్టాయిక్ పవర్ కంపెనీ (Emmvee Photovoltaic Power) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2900 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 11న మొదలవుతోంది. నవంబర్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒక్కో షేరుకు రూ.206-217గా నిర్ణయించారు. మహామాయ లైఫ్ సైన్సెస్ ఐపీఓఅందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 11న ఓపెన్ అవుతోంది. నవంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంంది. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ.108-114గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.70.44 కోట్లు సమీకరించనుంది. వర్క్ మేట్స్ కోర్ 2క్లౌడ్ సొల్యూషన్స్ ఐపీఓటెక్ సొల్యూషన్స్ సేవల సంస్థ వర్క్ మేట్స్ కోర్ 2 క్లౌడ్ సొల్యూషన్ (Workmates Core2Cloud Solution) సంస్థ ఈ వారం ఎస్ఎంఈ నుంచి వస్తున్న మరో ఐపీఓ. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.69.84 కోట్లు సమీకరించనుంది. ఇక సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 11న మొదలై 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒక్కో షేరు ధర రూ.200-204గా నిర్ణయించారు.