ఆలయంలో ఇదేం పనమ్మా.. ఎంత భక్తి అయితే మాత్రం ఇలా చేస్తారా?

Wait 5 sec.

దేవుడిపై భక్తి భావనను ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకుంటే.. మరికొందరు ఆలయ హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు దేవుడి సన్ని్ధిలో అన్నదానాలు నిర్వహిస్తూ తమ భక్తి భావాన్ని తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఉపవాసాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, సహస్రనామాలు, దీపారాధనలు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు భగవంతుడిపై వారి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ భక్తురాలు చేసిన పని మాత్రం భిన్నంగా ఉఁది. పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో వింత ఘటన జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తురాలు చేసిన పనితో ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు ఓ భక్తురాలు వచ్చింది. అయితే ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ.. ఆ మహిళ వెలుగుతున్న హారతి కర్పూరం తీసుకువెళ్లి ఆలయ హుండీలో వేసేసింది. అయితే ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల వారు ఎవరూ గుర్తించలేదు. కొద్దిసేపటికి ఆలయ హుండీలో నుంచి పొగ రావటాన్ని ఆలయ సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై.. హుండీలో నీళ్లు పోశారు. అయితే పొగ నిలిచిపోయింది కానీ.. ఈ ఘటనతో హుండీలోని నోట్లు మొత్తం తడిచిపోయాయి. కొన్ని నోట్లు కాలిపోయాయి. అనంతరం హుండీని తెరిచిన అధికారులు తడిచిన నోట్లను పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టారు. హెయిర్ డ్రైయర్ ద్వారా నోట్లను ఆరబెట్టారు. ఈ ఘటనలో కొన్ని కరెన్సీ నోట్లు కాలిపోయాయి.మరోవైపు హుండీలో నుంచి పొగ ఎలా వచ్చిందనేది కనిపెట్టేందుకు ఆలయ సిబ్బంది.. దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజీలో ఓ మహిళ ఈ పని చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో కాలిపోయిన డబ్బును ఆ మహిళ నుంచి రికవరీ చేస్తామని ఆలయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఫుటేజీ ఆధారంగా ఆ మహిళను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం, పిఠాపురం పాద గయ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంపైజారీ చేశారు.