తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు శుభవార్త. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత చీరల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూర్చనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఏడాది సెప్టెంబరు 9న చేసిన ప్రకటన మేరకు.. రాష్ట్రంలో మొత్తం 61 లక్షల చీరలను నిర్ణయించారు.చేనేతకు అండగా తయారీ.. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 318 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో చేనేత, జౌళి శాఖ మార్చి నెల నుంచే చీరల తయారీని చేపట్టింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు పెద్దఎత్తున ఉపాధి కల్పించింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం మహిళలకు ఉచిత చీరలు ఇవ్వడమే కాక.. రాష్ట్రంలోని చేనేత పరిశ్రమను ఆర్థికంగా బలోపేతం చేసినట్టయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. మొత్తం 61 లక్షల చీరలకు గాను 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. మిగిలిన చీరలను కూడా వారం రోజుల్లోగా జిల్లాలకు పంపించేందుకు చేనేత, జౌళి శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం పంపిణీ తేదీని ఖరారు చేయగానే, దానికి అనుగుణంగా పంపిణీ ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమవుతోంది.రెండు ముఖ్యమైన తేదీలు పరిశీలనలో.. ఉచిత చీరల పంపిణీ తేదీని ఖరారు చేసే విషయంలో ప్రభుత్వం రెండు ముఖ్యమైన రోజులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభించడం. డిసెంబరు 7వ తేదీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వార్షికోత్సవం సందర్భంగా పంపిణీని ప్రారంభించడం. ప్రభుత్వం ఏ తేదీని ఖరారు చేసినా.. ఈ నెల చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్న 61 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల్లో పండుగ వాతావరణం నెలకొంది.