బిగ్‌బాస్ ఈరోజు ఎపిసోడ్‌లో నాగ చైతన్య గెస్టుగా రావడం విశేషం. చైతూని చూడగానే రేయ్ ఏంట్రా ఇక్కడ.. అని నాగ్ అడిగారు. నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు కదా.. అని చై అడిగాడు. ఎందుకు తెలీదు బాగా తెలుసు.. అని నాగ్ నవ్వుకున్నారు.4 ఏళ్లకి ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేశారు.. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌కి నేను ఓనర్.. అని చై సర్‌ప్రైజ్ ఇచ్చారు. సూపర్ ఇది నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్.. అని నాగ ఆశ్చర్యంగా అడిగితే చేశానులే.. అంటూ చైతూ నవ్వాడు. ఇక చైతన్యని చూడగానే హౌస్‌మేట్స్ అందరూ హాయ్ అంటూ ఫుల్ ఎనర్జీతో మాట్లాడారు.హాయ్ చై గారు.. అని రీతూ పలకరిస్తే హాయ్ రీతూ గారు.. అని చై రిప్లయ్ ఇచ్చాడు. పిచ్చి మీరంటే నాకు.. అని రీతూ అనగానే మొన్నటిదాకా నేనని చెప్పావ్.. అని నాగ్ కౌంటర్ వేశారు. సార్ మీరు మీరే సార్.. అని రీతూ అంది. ఇది చీటింగ్ అబ్బా.. అంటూ చై నవ్వుకున్నాడు. సర్లే చైలో నీకు బాగా నచ్చిన విషయమేంటి చెప్పు.. అని నాగ్ అడిగారు.బయటికొచ్చేస్తా సార్కాళ్లుంటాయి సార్ చైతు గారి కాళ్లు ఎంత తెల్లగా ఉంటాయో సార్.. ఏదో శిల్పం చెక్కినట్లు ఉంటాయి.. అని రీతూ చెప్తుంటే చై సిగ్గుపడిపోయాడు. హలో రీతూ ఆ శిల్పం చెక్కింది నేనూ కూర్చో.. అంటూ నాగ్ మళ్లీ కౌంటర్ వేశారు. కార్తిక్ అనే పేరు ఉంది కదా సార్.. నేను నా బాయ్ ఫ్రెండ్ పేరు కార్తిక్ ఉండాలని కొద్ది రోజులు వెతికాను.. అని ఏమాయ చేశావే సినిమా గురించి రీతూ చెప్పింది. మరి నీ పేరు జెస్సీ కాదు కదా.. అంటూ చై కౌంటర్ ఇచ్చాడు.ఇక ప్రోమో చివరిలో రీతూకి నాగ్ ఒక ఆఫర్ ఇచ్చారు. చైకి బైక్స్ అంటే బాగా ఇష్టం.. నువ్వు హౌస్‌లో నుంచి ఇప్పుడు వచ్చేస్తే చై నిన్ను బైక్ రైడ్‌కి తీసుకెళ్తాడు.. అని నాగ్ అన్నారు. ఈ మాట వినగానే యస్ సార్ నేను వచ్చేస్తా.. అంటూ రీతూ గెంతులేసింది. గెలిచినా కూడా తర్వాత నిన్ను రైడ్‌కి తీసుకెళ్లొచ్చు కదా నేను.. దాని కోసం ఎందుకు వచ్చేయడం.. అని చై అన్నాడు. నేను మిమ్మల్ని జోష్ నుంచి గెలుచుకుందామనుకుంటున్నాను.. అంటూ రీతూ అనగానే ఓహో అంటూ నాగ్-చై నవ్వుకున్నారు.