FASTag Annual Pass: Annual Toll Pass (Rs. 3000)On National Highways Started - DetailsHere (adsbygoogle = window.adsbygoogle || []).push({});జాతీయరహదారుల పై వార్షిక టోల్ పాస్ (రూ.3 వేలు) యాక్టి వేషన్ ప్రక్రియ ప్రారంభం – పూర్తి వివరాలు ఇవే===================జాతీయరహదారుల పై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల వార్షిక టోల్ పాస్ (FASTag AnnualPass) ఆగస్టు 15 నుండి అమలులోకి వచ్చింది. రాజ్ మార్గ యాత్ర యాప్ లో ఈ పాస్ ను యాక్టివేట్ చేసుకొనేందుకు ఓలింక్ ను రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితరవాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. దీంతో ఇక టోల్ చెల్లింపులకుఫాస్టాగ్ కార్డులు పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.ఒక ఏడాది పాటులేదా 200 ట్రిప్పులు కు ఉపయోగం రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులుఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు (ఏదిముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. నూతన విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమేవర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ. 3వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనాచేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సినఅవసరం లేదు. పాత ఫాస్టాగ్ తోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.ట్రిప్పుఅంటే?ఒక్కో టోల్గేటు ఒక ట్రిప్పుగా లెక్కిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారు 4 టోల్ గేట్లను దాటాల్సి ఉంటుంది. అంటే వారు నాలుగుట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు. తిరిగి వస్తే మరో నాలుగుట్రిప్పులుగా పరిగణిస్తారు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావడానికి 8 ట్రిప్పులు అవుతాయి. వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరేమీకాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు, ఒకేసారి రూ.3వేలు చెల్లించడానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్నఫాస్టాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గెట్ లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తేసరిపోతుంది.ఉపయోగమా కాదా?ఇప్పుడున్నవిధానం ప్రకారం ఒక్కో గేట్ వద్దా కనీసం రూ.50చెల్లిస్తారనుకుంటే.. 200 గేట్లు దాటడానికిరూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పాస్ తో ఇది రూ.3 వేలకు తగ్గుతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున రూ. 7 వేల ప్రయోజనం చేకూరుతుంది.యాక్టివేషన్ఎలా?> ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదార్లు ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో రాజ్ మార్గ్ యాత్ర యాప్ ను డౌన్లోడ్చేసుకోవాలి.> మొబైల్నంబర్,వాహన నంబర్, ఫాస్టాగ్వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.> ‘Annual Pass’ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Activate’బటన్ మీద క్లిక్ చేసి పేమెంట్ గేట్ ద్వారా రూ. 3వేలు చెల్లించాలి. అనంతరం రెండు గంటల్లో పాస్ యాక్టివేట్అవుతుంది. ===================RAJMARGYATRAANDROID APPRAJMARGYATRA iOSAPPWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});