వడ్డీ రేట్లు పెంచిన SBI..ఇప్పుడు 20లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. EMI ఎంత కట్టాలి? పూర్తి లెక్కలివే

Wait 5 sec.

SBI Home Loan: అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన (SBI) షాకిచ్చింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల మేర గృహ రుణ వడ్డీ రేట్లు పెంచేసింది. అయితే ఈ పెంపు కొత్తగా లోన్ తీసుకునే వారికి వర్తిస్తుందని వెల్లడించింది. అంటే ఇప్పుడు కొత్తగా గృహ రుణం తీసుకున్నట్లయితే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంటే నెల నెలా కట్టాల్సిన ఈఎంఐ () కూడా పెరుగుతుంది. సవరించిన వడ్డీ రేట్లను ఆగస్టు 1వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ తాజాగా ప్రకటించింది. మరి ఇప్పుడు రూ.20 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు 7.50 శాతం నుంచి 8.45 శాతం వరకు ఉండగా దానిని 8.70 శాతానికి పెంచేసింది. అంటే 25 బేసిస్ పాయింట్ల వడ్డీ పెరిగింది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారిపై అధిక వడ్డీ భారం పడుతుందని గమనించవచ్చు. ' సిబిల్ స్కోర్, ఎక్స్‌టర్నర్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు ఆధారిత వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. హోమ్ లోన్ మార్జిన్ పెంచుకునేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. ఈ పెంపు కొత్త కస్టమర్లకు వర్తిస్తుంది. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారికి వర్తించదు.' అని ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. రూ.20 లక్షల హోమ్ లోన్‌కు EMI ఎంత?మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే కనిష్ఠ వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందవచ్చు. మరి కనిష్ఠ, గరిష్ఠ వడ్డీ రేట్ల వద్ద రూ.20 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసుకుందాం. మీరు రూ.20 లక్షల హోమ్ లోన్ 7.50 శాతం వడ్డీ రేటుతో 10 ఏళ్ల టెన్యూర్‌పై తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు మీరు నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ (EMI) రూ.23,740 అవుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో రూ.8,48,842 చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు 8.70 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు మీ నెలవారీ ఈఎంఐ అనేది రూ.25,012 అవుతుంది. అప్పుడు మీరు చెల్లించే వడ్డీ రూ.10,01,390 వరకు అవుతుంది. అంటే మీరు తీసుకున్న అప్పు డబులు చెల్లించాల్సి వస్తుంది.