ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లలో కూడా ఉచిత బస్సు అమలు, కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.. అయితే విలీన మండలాల్లో మాత్రం ఈ ఉచిత బస్సు పథకం అమలు కాలేదు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయితే ఏపీ సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ ప్రాంత మహిళలు కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు, అల్లూరి జిల్లాల పరిధిలోని ఏడు విలీన మండలాల సౌకర్యం కల్పించేందుకు రవాణా శాఖ అధికారులు ఒక పరిష్కారం వెతికారు. గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలు ఇప్పుడు ప్రస్తుతం ఏపీ పరిధిలోని ఏలూరు, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో ఉన్నాయి. ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు మార్గంలో ఉన్నాయి. కాబట్టి ఇవి అంతర్రాష్ట్ర సర్వీసులుగా పరిగణించబడుతున్నాయి. దీంతో ఈ బస్సులలో ఉచిత ప్రయాణం సాధ్యం కాదు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు.. రాష్ట్రంలోని బస్సు సర్వీసుల్లో మార్పులు చేశారు. కుక్కునూరు, కూనవరం, చింతూరు మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం డిపోల బస్సులు భద్రాచలం వరకు వెళ్లేవి. ఇప్పుడు వాటిని ఎటపాక వరకు పొడిగించారు. ఎటపాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.. దీంతో ఇవన్నీ రాష్ట్ర సర్వీసులుగా మారాయి. దీనివల్ల ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం ఏర్పడింది. ఇంతకుముందు ఈ బస్సులు భద్రాచలం వరకు మాత్రమే వెళ్ళేవి. భద్రాచలం వరకు వెళ్లడం వల్ల అవి అంతర్రాష్ట్ర సర్వీసులుగా పరిగణించబడేవి. ఇప్పుడు వాటి రూట్ మార్చారు. బస్సు బయలుదేరే చోటు, గమ్యస్థానం రెండు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో పూర్తిగా రాష్ట్ర సర్వీసుగా మారిపోయింది.తెలంగాణలోని ఏపీలోని ఎటపాక వరకు పొడిగిస్తే ఎన్‌క్లేవ్ సర్వీసులుగా మారుస్తారు. దీనివల్ల జిల్లాలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీని కోసమే ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్‌ మూర్తి బస్సు రూటును పరిశీలించారు.ఆయన స్వయంగా పరిశీలించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం డిపో నుండి 9 బస్సులు, గోకవరం డిపో నుండి 3 బస్సులు భద్రాచలం వరకు నడుస్తున్నాయి. వీటిని అంతర్రాష్ట్ర సర్వీసులుగా లెక్కిస్తున్నారు. అందుకే స్త్రీ శక్తి ఉచిత ప్రయాణానికి అనుమతించడం లేదు. ఈ బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా పరిగణించబడుతున్నాయి. నిన్నటి వరకు రాజమహేంద్రవరం, గోకవరం డిపోల నుండి భద్రాచలం వెళ్లే బస్సుల్లో స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం వర్తించకపోవడంతో మహిళలు టికెట్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎటపాక వరకు బస్సుల్ని పొడిగిస్తున్నారు.