గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. దీనిలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు .. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యాతో శాంతి ఒప్పందం కుదిర్చే దిశగా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అలానే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు గాను త్వరలోనే త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా.. ఉక్రెయిన్ రక్షణకు కట్టుబడి ఉందని.. అందుకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. జెలెన్‌స్కీతో భేటీ కన్నా ముందు .అలానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కావడం గౌరవంగా ఉందన్నారు ట్రంప్. వల్ల ప్రపంచమంతా ప్రభావితం అయ్యిందని.. సాధ్యమైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. జెలెన్‌స్కీ, పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలానే రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు త్రైపాక్షిక సమావేశం అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నేడు జరగబోతున్న త్రైపాక్షిక భేటీ సవ్యంగా సాగితే యుద్ధాన్ని ముగించేందుకు సరైన అవకాశం లభిస్తుందని తెలిపారు. అలానే ఉక్రెయిన్‌కు భారీగా సాయం చేస్తామని అలానే యూరప్ దేశాలకు కూడా రక్షణ కల్పిస్తామని, వారి రక్షణలో .సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీకి జెలెన్‌స్కీ కూడా అంగీకరించారు. అనంతరం ఐరోపా నేతలతో ట్రంప్ సమావేశమయ్యారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడెరిక్ మెర్జ్, నాటోసెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌తో పాటు తమకు కూడా అమెరికా నుంచి భద్రత హామీ కావాలని ఐరోపా దేశాల నేతలు ఈ సందర్భంగా కోరారు. అందుకు ట్రంప్ నుంచి సానుకూల ప్రకటన వచ్చింది.జెలెన్‌స్కీతో సమావేశానికి ముందు ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్ల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్‌ మరిచిపోవాల్సి ఉంటుందున్నారు. అలానే నాటోలో ప్రవేశించాలన్న కోరికను కూడా వదులుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీని గురించి ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. యుద్ధం విరమించాలా.. లేదా కొనసాగించాలా అనేది జెలెన్‌స్కీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నిర్ణయించుకుంటే వెంటనే యుద్ధాన్ని విరమించొచ్చు.. కావాలనుకొంటే కొనసాగించవచ్చు. అయితే ఒబామా ఇచ్చేసిన క్రిమియాను మాత్రం జెలెన్‌స్కీ తిరిగి పొందలేరు. అలానే నాటో సభ్యత్వాన్ని కూడా పొందలేరు. కొన్ని విషయాలను మార్చలేం అని పేర్కొన్నారు. త్రైపాక్షిక సమావేశం తర్వాత ఎలాంటి పరిణాామాలు చోటు చేసుకుంటాయో చూడాలి అంటున్నారు.