HYD: కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి.. వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

Wait 5 sec.

హైదరాబాద్‌ మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ భారీ గణనాథుడి విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా.. బండ్లగూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న భారీ విగ్రహం హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో.. విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు టోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం..ఇక రామంతాపూర్‌లోని గోఖలే నగర్‌లో ఆదివారం అర్థరాత్రి ఘరో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర సందర్భంగా.. శ్రీకృష్ణుడి రథం విద్యుత్ తీగలను తాకి షాక్‌కు గురై ఐదుగురు మరణించారు. వాహనం బ్రేక్ డౌన్ కావటంతో కొందరు యువకులు చేతులతో రథాన్ని తోస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది స్పృహ కోల్పోయారు. వీరిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వీరిని రక్షించడానికి స్థానికులు సీపీఆర్ వంటి ప్రాథమిక చికిత్సలు అందించినా ఫలితం లేకుండా పోయింది. రామంతాపూర్ ఘటనపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.