: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన .. గత కొన్ని రోజులుగా బీజేపీపై, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా మీడియా ముందు రాహుల్ గాంధీ బయటపెట్టడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కర్ణాటక, బిహార్‌ సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని.. భారీగా దొంగ ఓట్లు నమోదైనట్లు రాహుల్‌ గాంధీతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అంశంలో దేశ ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తీసుకుంది. రాహుల్ ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు ఈసీ సిద్ధమైంది. ఓట్ల చోరీ ఆరోపణలు వస్తున్న వేళ.. ఈనెల 17వ తేదీ (ఆదివారం) రోజున ఎన్నికల సంఘం అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌ గాంధీ.. బిహార్‌లో ‘ఓటు అధికార యాత్ర’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్న అదే రోజు ఈసీ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సాధారణంగా లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే సమయంలో మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈసీ ఆదివారం ఎందుకు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టనుంది అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. గత కొంతకాలంగా ఈసీపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్న వేళ.. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం గమనార్హం. ఇక పదే పదే ప్రతిపక్షాలు ‘ఓట్ల చోరీ’ అనడాన్ని ఇప్పటికే ఈసీ తీవ్రంగా తప్పుపట్టింది. మరికొన్ని రోజుల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓట్ల చోరీపై గత కొన్ని రోజులుగా భారీగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, హర్యాణా రాష్ట్రాల్లోనూ ఓట్లు చోరీకి గురయ్యాయని.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీ జరిగాయని.. వాటికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపించారు. అయితే ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా.. లిఖితపూర్వంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సూచించింది. లేదంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.