గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలామంది ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వరద ముప్పు పెరిగింది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై కూడా అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు, ప్రజలకు సూచనలు.. ఈ కుండపోత వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో నీరు నిలబడి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నదులు, చెరువులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని, హెచ్చరించారు. ఈ వర్షాలు రైతుల పంటలను నాశనం చేయడమే కాకుండా, వారి ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం వారి కష్టాలను అర్థం చేసుకుని, తగిన సహాయం అందించాలని రైతులు కోరుకుంటున్నారు. జిల్లాల వారీగా వర్ష సూచన.. వాయుగుండం, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు రోజులు కురుస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 18న ఐదు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జారీ చేసింది. ఈ జాబితాలో కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. అదే రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 19న వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.