బంగారం గుట్టలు పేర్చుతోన్న RBI.. మరో 400 కిలోలు కొనుగోలు.. మొత్తం ఎంతుందంటే?

Wait 5 sec.

: బంగారం దిగుమతుల్లో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంది. ప్రజలతో పాటు ఇప్పుడు దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైతం భారీగా బంగారం కొంటోంది. ఇప్పటికే టన్నుల కొద్ది బంగారం నిల్వ చేసిన రిజర్వ్ బ్యాంక్ గత నెలలో మరో 40 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. జూన్ నెలలో 400 కిలోల బంగారం కొనుగోలు చేసినట్లు ఆర్‌బీఐ నెలవారి బులిటెన్ ద్వారా తెలుస్తోంది. మన విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాట 12 శాతంగా ఉందని పేర్కొంది. 'కొన్ని కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ పడింది. ఈ క్రమంలో జూన్ ప్రథమార్ధంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో జూన్ ద్వితీయార్ధంలో పసిడి ధరలు దిగివస్తున్నాయి. క్రూడ్ ఆయిల్, లోహ ధరల్లో పరిమిత కదలికలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్లూమ్ బర్గ్ కమొడిటీ ధరలు సూచీ పెరిగింది' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. చమురు ధరలు 10 శాతం పెరిగినట్లయితే ఇన్‌ఫ్లేషన్ 0.20 శాతం పెరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 10 శాతం పెరిగినట్లయితే మన దేశంలో ద్రవ్యోల్బణం 0.20 శాతం వరకు పెరిగవచ్చని ఆర్‌బీఐ ఆర్థిక వేత్తలు రూపొందించిన డాక్యుమెంట్ పేర్కొంది. ముడి చమురు దిగుమతులు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని కోరింది. అయితే దేశీయ నిల్వలను పెంచుతోంది. ఇంకా 42 శాతం మేర గోల్డ్ విదేశాల్లోనే దాచి పెట్టింది. 2023, మార్చిలో మన దేశంలోని 300 టన్నులుగా ఉండగా.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, సహా విదేశాల్లో భారీగా బంగారం ఉంది. ప్రపంచ స్వర్ణ మండలి లెక్కల ప్రకారం 15 టన్నుల మేర గోల్డ్ డిపాజిట్లలో ఉంది. అలాగే దేశీయం 512 టన్నుల నిల్వలు ఉన్నాయి. మిగిలినది బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉన్నట్లు తెలిపింది.