అద్భుతం చేసిన స్కీమ్ .. రూ.10వేల పొదుపుతో రూ.1.62 కోట్లొచ్చాయ్..!

Wait 5 sec.

MF Tracker: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చాలా ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలు అందించాయి. సగటు వార్షిక రాబడులను మించి లాభాలు ఇచ్చాయి. ఈక్విటీ పథకాల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాబితాలో చేరింది ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యూటీఐ () తీసుకొచ్చిన (). ఈ స్కీమ్ తమ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు అందించింది. ఈ స్కీమ్ ప్రారంభం నుంచి నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి క్రమం తప్పకుండా కొనసాగిస్తూ వచ్చిన వారికి ఇప్పుడు వారి యూనిట్ల విలువ రూ.1.62 కోట్లు అవుతుంది. ఈ స్కీమ్ 20 ఏళ్ల సిప్ రాబటి XIRR విలువ 16.73 శాతంగా ఉన్నట్లు ఈటీ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. ఈ ఫండ్‌కి వాల్యూ రీసర్చ్, మార్నింగ్ స్టార్ సంస్థలు 2 స్టార్ రేటింగ్ ఇచ్చాయి. అలాగే గత 10 సంవత్సరాల రిటర్న్స్ చూసుకున్నా భారీగానే ఉన్నాయి. 10 సంవత్సరాల్లో సిప్ రాబడి వార్షికంగా 16.52 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే నెలకు రూ.10 వేలు క్రమానుగత పెట్టుబడి కొనసాగించిన వారికి రూ.28.49 లక్షలు వచ్చాయి. అలాగే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఈ మిడ్ క్యాప్ ఫండ్ ఏడాదికి 17.69 శాతం చొప్పున రాబడులు అందిస్తు రూ.10 వేల సిప్ పెట్టుబడిని రూ.9.31 లక్షలు చేసింది. అలాగే గత మూడేళ్ల కాలంలో చూస్తే సిప్ రాబడి వార్షికంగా 15.96 శాతంగా ఉంది. దీని ప్రకారం నెలవారీ రూ.10 వేల పొదుపుతో 3 ఏళ్లలోనే చేతికి రూ.4.55 లక్షలు అందాయి. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగితే ఇప్పుడు ఆ విలువు రూ.18.97 లక్షలు అవుతుంది. ఈ స్కీమ్ 20 ఏళ్ల సగటు వార్షిక రాబడి CAGT 15.85 శాతంగా ఉంది. గత గత 10 సంవత్సరాల రాబడలు గమనిస్తే రూ.1 లక్ష పెట్టుబడి రూ.3.63 లక్షలు అయింది. 10 ఏళ్లలో సగటు వార్షిక రాబడి 13.77 శాతంగా ఉంది. ఇక గత మూడేళ్ల కాలంలో చూసుకుంటే సీఏజీఆర్ రేటు 24.74 శాతంగా ఉంది. దీని ప్రకారం రూ.1 లక్ష పెట్టుబడిని రూ.3.02 లక్షలు చేసింది.